విరాట్ 'సుల్తాన్' సినిమా వద్దన్నాడు.. | Virat Kohli asked Anushka Sharma to refuse Sultan? | Sakshi
Sakshi News home page

విరాట్ 'సుల్తాన్' సినిమా వద్దన్నాడు..

Published Sat, Feb 13 2016 4:46 PM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

విరాట్ 'సుల్తాన్' సినిమా వద్దన్నాడు..

విరాట్ 'సుల్తాన్' సినిమా వద్దన్నాడు..

విరాట్ కోహ్లి, అనుష్క శర్మల ప్రేమకథే కాదు.. బ్రేక్ అప్ స్టోరీ కూడా సంచలనం కలిగిస్తోంది. విరాట్ కోహ్లీ పెళ్లి ప్రపోజల్ ను అనుష్క తిరస్కరించిందని, కెరీర్ కోసమే ఇద్దరూ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టారని ఇన్నిరోజులూ ప్రచారమవుతున్నదానికి భిన్నంగా తాజాగా మరో కథనం తెరపైకి వచ్చింది. విరాట్ కోహ్లీ, అనుష్కలు విడిపోవడానికి 'సుల్తాన్' సినిమానే కారణం అంటున్నాయి సినీ వర్గాలు.

పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలించిన తరువాత సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' సినిమాలో కథానాయికగా అనుష్కను  ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్తో తొలిసారి జతకట్టనున్న అనుష్కకు ఇది భారీ ప్రాజెక్ట్. అయితే విరాట్ కోహ్లీకి మాత్రం అనుష్క ఈ సినిమాలో నటించడం ఇష్టం లేదు. అదే విషయాన్ని ప్రియురాలితో సున్నితంగా చెప్పాడు. కానీ కోహ్లీ జోక్ చేస్తున్నాడని భావించిన అనుష్క సుల్తాన్ సినిమాను అంగీకరించింది. దీంతో ఈసారి కోహ్లీ సీరియస్గా 'సినిమాల సంగతి పక్కనపెట్టి ముందు ఇంటిని ఎలా నడపాలో నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించు' అంటూ త్వరలో కాబోతున్న వారి వివాహాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాడని వినికిడి. కోహ్లి మాటలకు గట్టిగానే సమాధానం ఇచ్చింది అనుష్క.

అంతే.. వివాదం కాస్తా విడిపోవడానికి దారి తీసింది. తాను నటిస్తున్న ఓ సినిమాతో కలిపి ఇప్పటికే అనుష్క మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంది. వీటితోపాటు చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. కెరీర్ ఇంత పీక్ స్టేజ్ లో ఉండగా పెళ్లి చేసుకునేందుకు, అలాగే కోహ్లీ  చెప్పినట్లు సినిమాలు వదులుకునేందుకు అనుష్క ప్రస్తుతం సిద్దంగా లేకపోవడంతో ఇక 'బ్రేక్ అప్' ఒక్కటే వీరికి కనిపించిన దారిగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ గడసరి క్రికెటర్, సొగసరి హీరోయిన్ల ప్రణయగాధ ఇలా ముగియడం అభిమానులకి చేదు వార్తే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement