ఎవరైనా ఓకే! | Anyone okay! | Sakshi
Sakshi News home page

ఎవరైనా ఓకే!

Published Thu, Jun 25 2015 11:39 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

ఎవరైనా ఓకే! - Sakshi

ఎవరైనా ఓకే!

‘‘నేనా? ప్రేమలో పడ్డానా? ఒకవేళ పడితే, ఆ విషయాన్ని నిర్భయంగా బయటికి చెప్పేస్తాను’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. ఈ బ్యూటీ ఈ స్టేట్‌మెంట్ ఇచ్చింది చెన్నయ్‌లో. ధనుష్ సరసన కాజల్ నటిస్తున్న తమిళ చిత్రం ‘మారి’.
 
 ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కాజల్‌ని, ‘మీరు ప్రేమలో పడ్డారట?’ అని విలేకరులు అడిగితే, ఆమె పై విధంగా స్పందించారు. పోనీ.. మీక్కాబోయే భర్త ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? అని కాజల్‌ని అడిగారట. అప్పుడు కాజల్ మాట్లాడుతూ  - ‘‘ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు.
 
 అలాగే, ఫలానా నగరానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనే నియమం కూడా పెట్టుకోలేదు. భారతదేశంలో ఏ నగరానికి చెందిన వ్యక్తయినా నాకు ఓకే. కానీ, ఆ వ్యక్తి నిజాయతీగా ఉండాలి. నన్నర్థం చేసుకుని, జీవితాంతం నాకు మంచి తోడుగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement