రౌడీ బేబీ అంటున్న ధనుశ్‌ | Rowdy Baby Fun & Peppy Song Out- Dhanush, Sai Pallavi | Sakshi
Sakshi News home page

రౌడీ బేబీ అంటున్న ధనుశ్‌

Published Mon, Dec 17 2018 1:58 AM | Last Updated on Mon, Dec 17 2018 1:58 AM

Rowdy Baby Fun & Peppy Song Out- Dhanush, Sai Pallavi - Sakshi

ధనుశ్‌

కోలీవుడ్‌ స్టార్‌ ధనుశ్‌ సింగర్‌గా ఎంత పేరు సంపాదించుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాను హీరోగా నటించిన ‘3’ సినిమాలో ధనుశ్‌ పాడిన ‘వై దిస్‌ కొలవెరి..’ సాంగ్‌ బాగా పాపులర్‌ అయ్యింది. ఆ తర్వాత కూడా కొన్నిసార్లు ధనుశ్‌ గొంతు సవరించుకున్నారు. తాజాగా డైరెక్టర్‌ వసంతబాలన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జైలు’ సినిమా కోసం సాంగ్‌ పాడారు.

‘జైలు’ సినిమాలో హీరోగా నటించిన సంగీతదర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ ఈ విషయం తెలిపారు. అలాగే ధనుశ్‌ లే టెస్ట్‌ చిత్రం ‘మారీ 2’ ఈ నెల 21న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్‌ కానుంది. బాలాజీ మోహన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ‘మారీ’ చిత్రానికి సీక్వెల్‌. ఈ చిత్రాన్ని తెలుగులో సాయి కృష్ణ పెండ్యాల రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో ‘రౌడీ బేబీ..’ అనే సాంగ్‌ను తెలుగులో ధనుశ్‌ పాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement