... నా గుండె లబ్‌డబ్ పెరిగిపోతుంది! | Overcame fear of birds in 'Maari': Kajal Aggarwal | Sakshi
Sakshi News home page

... నా గుండె లబ్‌డబ్ పెరిగిపోతుంది!

Published Sat, Jan 31 2015 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

... నా గుండె లబ్‌డబ్ పెరిగిపోతుంది!

... నా గుండె లబ్‌డబ్ పెరిగిపోతుంది!

‘‘పక్షుల్ని దూరంగా చూడాలనుకుంటాను కానీ, దగ్గరగా అంటే మాత్రం ఆమడ దూరం పారిపోతా. అవి రెక్కలు టపటపలాడిస్తే చాలు.. నా గుండె లబ్‌డబ్ పెరిగిపోతుంది. అంత భయం’’ అని చెప్పారు కాజల్ అగర్వాల్. పక్షులంటే అంత భయపడే కాజల్ ఇటీవల ఏకంగా ఓ పావురాన్ని చేత్తో పట్టుకుని, ఫొటోలు దిగారు. హఠాత్తుగా ఆమె అంత ధైర్యవంతురాలు కావడానికి కారణం తమిళ హీరో ధనుష్. అతని సరసన కాజల్ ‘మారి’ అనే తమిళ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పక్షులు ఉండే సన్నివేశాలు చాలా ఉన్నాయట.
 
 చిత్రదర్శకుడు బాలాజీ మోహన్ ఈ సన్నివేశాల గురించి వివరించగానే చాలా భయపడ్డానని కాజల్ చెప్పారు. కానీ, పక్షుల గురించి ధనుష్ చిన్నపాటి లెక్చర్ ఇచ్చి, అవి మనల్ని ఏమీ చేయవంటూ ధైర్యం చెప్పడంతో కొంచెం కంగారుగానే కెమెరా ముందుకెళ్లారామె. భయాన్ని బయటకు కనపడనివ్వకుండా ఎలాగోలా సన్నివేశం పూర్తి చేసి, ఊపిరి పీల్చుకున్నారట. మూడు, నాలుగు రోజులు ఇదే వరస. ఐదో రోజుకి భయం తగ్గి, ఆ తర్వాత ఏకంగా ఫొటోలు దిగేంత ధైర్యం వచ్చేసిందామెకు. ఇప్పుడు పక్షులంటే తనకు భయం పోయిందనీ, పక్షి ప్రేమికురాల్ని అయిపోయాననీ కాజల్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement