రెహమాన్‌కు షాకిచ్చిన అభిమానులు | AR Rahman Performed Tamil Songs And Shock To Fans | Sakshi
Sakshi News home page

రెహమాన్‌కు షాకిచ్చిన అభిమానులు

Published Fri, Jul 14 2017 3:06 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

రెహమాన్‌కు షాకిచ్చిన అభిమానులు

రెహమాన్‌కు షాకిచ్చిన అభిమానులు

ముంబయి: స్వర మాంత్రికుడు, ఆస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహమాన్‌కు ఆయన అభిమానులు షాకిచ్చారు. ఎప్పుడూ ఏఆర్‌ రెహమాన్‌ పాటలంటే చెవికోసుకునే అభిమానులు ఈసారి మాత్రం ఆయన చేస్తున్న ప్రోగ్రాం తమకు నచ్చలేదని మధ్యలోనే వెళ్లిపోతూ తాము చెల్లించిన డబ్బును వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ కూడా డిమాండ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో చేరి పెద్ద మొత్తంలో ఏఆర్‌ రెహమాన్‌ ప్రోగ్రాంపై వారు తమ నిరసన స్వరాలు వినిపించారు. ఇంతకీ ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ ప్రోగ్రాం మీద ఎందుకు అభిమానులకు కోపం వచ్చిందని అనుకుంటున్నారా..

గత వారం లండన్‌లో రెహమాన్‌ సంగీత కచేరి నిర్వహించారు. అక్కడ ఆయన పాడిన పాటలన్నీ కూడా తమిళపాటలేనట. దీంతో ఆ ప్రోగ్రాంకు వచ్చినవారంతా కూడా ఏఆర్‌ రెహమాన్‌ బాలీవుడ్‌లో పేరు తెచ్చుకొని, జన్మరిత్యా తమిళుడైనందువల్లే ఎక్కువగా తమిళ గీతాలు ఆలపించారని, ఆయన కనీసం హిందీపాటలు కాకపోయినా పంజాబీ సాంగ్స్‌ పాడిన సంతోషపడేవాళ్లమంటూ వారు ట్వీట్‌లలో పేర్కొన్నారు.

కొంతమంది ప్రోగ్రాంను ఆపేయాలని డిమాండ్‌ చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా ఆ కార్యక్రమం ముగియకముందే వెళ్లిపోతూ తమ డబ్బు తమకు ఇవ్వాలని అడిగారంట. దీంతో నిర్వాహకులు షాక్‌ తిన్నారు. అయితే, ఆయన హిందీ చిత్రాల్లోని పాటలు కూడా పాడారని, నిజం చెప్పాలంటే హిందీ గీతాలే ఎక్కువ ఆలపించారని, నిర్వహకులు చెప్పారు. హిందీ ప్రాంతం నుంచి ఈ ప్రోగ్రాంకు హాజరైన వాళ్లంతా కూడా తాను బాలీవుడ్‌లోనే గుర్తింపు పొందారనే విషయం రెహమాన్‌ గుర్తించుకుంటే మంచిదని అనుకుంటూ వెళ్లిపోయారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement