స్టేషన్‌లో అరవింద సమేతంగా... | Aravinda Sametha Movie Shooting Was Held In Metro Station | Sakshi
Sakshi News home page

స్టేషన్‌లో అరవింద సమేతంగా...

Published Mon, Aug 13 2018 12:36 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

Aravinda Sametha Movie Shooting Was Held In Metro Station - Sakshi

ట్రైన్‌ కరెక్ట్‌ టైమ్‌కి వస్తుందా? ఆలస్యం ఏమైనా ఉందా? అని ఎంక్వైరీ చేస్తున్నారు వీర రాఘవ. ప్రేయసిని కూడా వెంటబెట్టుకుని రైల్వే స్టేషన్‌కు వచ్చారు. మరి ఈ ప్రేమ ప్రయాణం ఎక్కడిదాకా? అనేది దసరా పండగ టైమ్‌లో తెలుస్తుంది. ఎన్టీఆర్‌ హీరోగా త్రివ్రికమ్‌ దర్శకత్వంలో ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్‌లో జరుగుతోందని సమాచారం. ఎన్టీఆర్, పూజాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

షూటింగ్‌ తాలూకు ఫొటోలు బయటకు రాకూడదని యూనిట్‌ ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో లీక్‌ అవ్వడం యూనిట్‌ను కలవరపెడుతోంది. ఆ మధ్య కొన్ని ఫొటోలు లీకయ్యాయి. ఆ సంగతలా ఉంచితే.. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ క్లాస్, ఎన్టీఆర్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ కలగలిపి ఉండేలా ఈ టీజర్‌ను కట్‌ చేస్తున్నారట టీమ్‌. జగపతిబాబు, నాగబాబు, రావు రమేష్, ఈషా రెబ్బా కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 10న విడుదల చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీజర్‌లో మూవీ రిలీజ్‌ డేట్‌ను అఫీషియల్‌గా లాక్‌ చేస్తారని ఊహించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement