ఒంటరిగా ఉన్నందుకే... | Arjun Kapoor: Link-up rumours don’t bother me, it is the price I’m paying for being single | Sakshi
Sakshi News home page

ఒంటరిగా ఉన్నందుకే...

Published Wed, May 7 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

ఒంటరిగా ఉన్నందుకే...

ఒంటరిగా ఉన్నందుకే...

 సహతారలతో సంబంధాల ఆరోపణలతో వర్ధమాన నటుడు అర్జున్ కపూర్ కు తలబొప్పి కడుతోంది. పరిశ్రమలో పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఒంటరిగా ఉన్నందువల్లనే ఇటువంటి పుకార్లు షికార్లు చేస్తున్నాయని వాపోయాడు. ఇందుకు తాను అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నాడు. ఇప్పటివరకూ నాలుగు సినిమాల్లో నటించిన అర్జున్‌కపూర్‌కు... అలియాభట్, పరిణతి చోప్రాలతో సంబంధముందనే పుకార్లు బాలీవుడ్‌లో షికార్లు చేస్తున్నాయి. వారిరువురి విషయమై అర్జున్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వారితో తెరపైనా, తెరవెనుకా తనకు కెమిస్ట్రీ బాగా కుదురుతుందన్నాడు. వారితో ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నాడు.
 
 ‘మేమంతా పరస్పరం ఎంతో సౌకర్యవంతంగా ఉంటాం. గొప్ప స్నేహితులం. అందువల్లనే తెరపైకూడా మామధ్య కెమిస్ట్రీ బాగా కుదురుతుంది. ‘2 స్టేట్స్’ సినిమాకి ముందే పరిణతితో నాకు పరిచయం ఉంది. అటువంటి పుకార్లను నేను పట్టించుకోను. అటువంటివి నన్ను ఎంతమాత్రం బాధ పెట్టవు. నటుడిగా కొనసాగుతూ ఒంటరిగా ఉంటే ఇటువంటివన్నీ సహజమే. కాగా అర్జున్ కపూర్... అలియాతో కలిసి ‘2 స్టేట్స్’లో, ‘గుండే’ సినిమాలో పరిణతిచోప్రాతో కలిసి నటించాడు. ‘గుండే’ సినిమాతోనే అర్జున్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇదిలాఉంచితే ప్రాక్టర్ అండ్ గాంబ్లర్ సంస్థ మానసిక వికలాంగులైన చిన్నారుల కోసం నిర్వహిస్తున్న ‘శిక్ష’ అనే విద్యా కార్యక్రమానికి అర్జున్ తనవంతు సహకారం అందిస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement