పుస్తక ముఖచిత్రం
నటుడు రంగనాద్‌ను ‘రియల్ లైఫ్‌లో క్లియర్ హీరో’ అంటున్నారు ఆయన చిరకాల మిత్రుడు రమణబాబు. రంగనాద్ గారిపై రమణబాబు రచించిన పుస్తకం పేరది. ఈ పుస్తకం గురించి, రంగనాద్‌గారితో ఉన్న అనుబంధం గురించి రమణబాబు మాట్లాడుతూ– ‘1980లో రంగనాద్ గారితో నా మొదటి పరిచయం ఏర్పడింది. ఆ రోజు నుండి ఆయన చనిపోయేంత వరకు ప్రతిరోజు మాట్లాడుకొనేంత స్నేహం మా మధ్యలో ఉంది. డిసెంబర్ 19తో ఆయన స్వర్గస్తులై 3 సంవత్సరాలైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనతో నాకున్న స్నేహానికి గుర్తుగా నేను ఈ పుస్తకాన్ని రచించాను.
ఇందులో రంగనాద్ నటించిన మొదటి చిత్రం ‘చందన’ నుండి అనేక చిత్రాల వివరాలతో పాటు ఎన్నో వ్యక్తిగత విషయాలను మీ ముందుంచాను. ఆయన గురించి ఎంతో మంది సినీ ప్రముఖుల దాసరి, కృష్ణంరాజు, కృష్ణ, విజయ నిర్మల, యస్పీ బాల సుబ్రహ్మణ్యం, గిరిబాబు వంటి ప్రముఖుల అభిప్రాయాలను పొందుపరిచాను. ఆయన అభిరుచులు, వ్యక్తిగతంగా ఆయన ఎంత లోతున్నవారో, ఇండస్ట్రీలో అజాత శత్రువుగా ఎలా మెలిగారో అనే విషయాలను ‘రియల్ లైఫ్‌లో క్లియర్ హీరో’ ద్వారా మీకు సవివరంగా తెలియజేశాను’’ అన్నారు రమణబాబు.
Comments
Please login to add a commentAdd a comment