శివ భక్తునిగా... | As a bhakta of shiva | Sakshi
Sakshi News home page

శివ భక్తునిగా...

Published Wed, May 21 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

శివ భక్తునిగా...

శివ భక్తునిగా...

‘‘ఇందులో శివ భక్తునిగా కనిపిస్తాను. ‘సామాన్యుడు, ప్రస్థానం, ఎవడు’ సినిమాల తర్వాత అంతటి శక్తిమంతమైన పాత్ర ఇది’’ అని సాయికుమార్ చెప్పారు. కిషోర్ వెన్నెలకంటి దర్శకత్వంలో ప్రసనాక్షి పిక్చర్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ‘ఎవరికి ఎవరు’. అరుణ్, ఆర్య, ప్రజ్ఞ, తనిష్క్ తివారి ముఖ్యతారలు. సాయికుమార్, నాగబాబు, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సాయికుమార్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘కళాశాల, రాజకీయ నేపథ్యంలో సాగే నేరప్రధాన ప్రేమకథ ఇది. ఇప్పటికి 70 శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్ని కృష్ణ, కెమెరా: జి. వెంకటేశ్వర ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రవికాంత్ కౌషిక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement