
36 ఏళ్ల వయసులో...
కొంత విరామం తర్వాత జ్యోతిక మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. మలయాళ చిత్రం 'హౌ ఓల్డ్ ఆర్ యు' తమిళ రీమేక్‌లో ఆమె నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ టైటిల్ పెడితే బాగుంటుందని చిత్రబృందం చర్చించినప్పుడు చిత్రబృందం '36 వయదినిలే' అని పెడితే బాగుంటుందని జ్యోతిక అన్నారట. అంటే.. 36 ఏళ్ల వయసులో... అని అర్థం. ఈ టైటిల్ అందరికీ నచ్చడంతో దాన్నే ఖరారు చేశారని సమాచారం.