
పదేళ్ల తర్వాత...
‘చంద్రముఖి’లాంటి సినిమాతో క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకున్న నటి జ్యోతిక. హీరో సూర్యని పెళ్లాడాక పూర్తిగా కుటుంబానికే అంకితమైపోయి, నటనకు దూరమయ్యారు. మధ్యలో ఒకటి, రెండు వాణిజ్య ప్రకటనల్లో భర్తతో కలిసి నటించారు. ఆమె సినిమాల కోసం మేకప్ వేసుకుని దాదాపు పదేళ్లవుతోంది. తాజాగా ఆమె రీఎంట్రీకి రంగం సిద్ధమువుతోంది.
మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘హౌ ఓల్డ్ ఆర్ యూ’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో ప్రధాన భూమికను జ్యోతిక పోషించనున్నారు. మాతృకకు దర్శకుడైన రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. మహిళా సాధికారత నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో నటించడం కోసం జ్యోతిక చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.