అవతారం
అవతారం
Published Mon, Jan 27 2014 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
సైన్స్‌లో జరిగే పరిణామాల కారణంగా ఒక గ్రహం భూమికి చేరువగా జరిగితే ఏర్పడే పరిస్థితుల నేపథ్యంలో శతచిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అవతారం’. ఎం. కవిత సమర్పణలో అరుంధతి ఆర్ట్ ఫిలింస్ పతాకంపై ఎం. యుగంధర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధికా కుమారస్వామి, భానుప్రియ, రిషి ముఖ్య తారలు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘సరికొత్త కథను కొత్త కోణంలో కోడి రామకృష్ణ ఆవిష్కరించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన అమ్మోరు, అరుంధతి సాంకేతికంగా అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రం టెక్నికల్‌గా మరో మెట్టు పైనే ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి అనుకున్న బడ్జెట్‌కన్నా ఎక్కువైంది. సినిమా నిర్మాణానికి కూడా ఎక్కువ సమయం పట్టింది. ఆలస్యం అయినా సినిమా అద్భుతంగా రావడంతో ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రకుమార్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కోడి రామకృష్ణ.
Advertisement
Advertisement