లీకైన బాహుబలి 2 వీడియో
భారీ చిత్రాలకు లీక్ల బెడద తప్పటం లేదు. సాంకేతికత అభివృద్ది చెందుతున్న కొద్దీ, లాభాలతో పాటు నష్టాలు కూడా అదే స్ధాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమ లీకులు, పైరసీ మూలంగా తీవ్రంగా నష్టపోతోంది. తాజాగా మరోసారి టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ బాహుబలి 2కి సంబంధించిన వార్ సీన్ ఒకటి నెట్లో హల్చల్ చేస్తోంది. గతంలో బాహుబలి తొలి భాగం రిలీజ్కు ముందు కూడా ఇలాగే వార్ ఎపిసోడ్ లీక్ అవ్వటంతో చిత్రయూనిట్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నిచర్యలు తీసుకున్న లీకుల బెడద మాత్రం తప్పటం లేదు.
తాజాగా బాహుబలి 2 విషయంలోనూ అదే జరిగింది. దాదాపు మూడు నిమిషాల వార్ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనుష్క, ప్రభాస్లపై చిత్రీకరించిన ఈ సీన్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి కాకుండానే నెట్లో ప్రత్యక్షమైంది. ఇప్పటికే చర్యలు మొదలు పెట్టిన చిత్రయూనిట్ నెట్లో వీడియోను డిలీట్ చేసినా.. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న వారి ద్వారా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరోవైపు బాహుబలీ యుద్ధ సన్నివేశాలు నిజంగా లీక్ అయ్యాయా లేక పబ్లిసిటీ స్టంటా అనే దానిపై సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి.