ఒక సినిమా మూడు పెళ్లిళ్లు | Prabhas, Anushka, Rana To Marry After Bahubali 2 | Sakshi
Sakshi News home page

ఒక సినిమా మూడు పెళ్లిళ్లు

Published Sun, Dec 4 2016 10:45 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

ఒక సినిమా మూడు పెళ్లిళ్లు - Sakshi

ఒక సినిమా మూడు పెళ్లిళ్లు

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా బాహుబలి. ప్రస్తుతం రెండో భాగం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ కోసం యూనిట్ సభ్యులు, అభిమానులతో పాటు ఈ సినిమాలో నటించిన లీడ్ ఆర్టిస్ట్ల కుటుంబ సభ్యులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే వీరి ఎదురుచూపులు సినిమా రిజల్ట్ కోసం మాత్రం కాదు. ఈ భారీ చిత్రం రిలీజ్ తరువాత సినిమాలో కీలక పాత్రల్లో నటించిన ముగ్గురు స్టార్ల పెళ్లిళ్లపై క్లారిటీ రానుంది.

బాహుబలిగా వెండితెర మీద అలరిస్తున్న ప్రభాస్, పెళ్లి వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. బాహుబలి తరువాత ఈ యంగ్ రెబల్ స్టార్, ఓ ఇంటి వాడవుతాడంటూ స్వయంగా ప్రభాస్ పెదనాన్న, కృష్ణంరాజు ప్రకటించటంతో.. ఈ సినిమా తరువాత ప్రభాస్ పెళ్లి పీటలెక్కటం కాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో హీరోయిన్ అనుష్క పెళ్లిపై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్న స్వీటి, త్వరలోనే అతనితో ఏడడుగులు నడిచేందుకు ప్లాన్ చేసుకుంటుందట. అయితే అనుష్క పెళ్లి కూడా బాహుబలి రిలీజ్ తరవాతే అంటున్నారు. ఇక టాలీవుడ్ హంక్ రానా పెళ్లి కూడా త్వరలోనే జరగొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి పెళ్లి ప్రస్తావన లేకపోయినా.. సీనియర్ హీరోయిన్లతో ఎఫైర్లంటూ రానాపై చాలానే రూమర్లు ఉన్నాయి. దీనికి తోడు ఇప్పటికే మూడుపదుల మార్క్ దాటిన రానా పెళ్లిపై కుటుంబ సభ్యులు తొందర పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ ఒక్క సినిమా రిలీజ్ తరువాతే ఈ ముగ్గురు స్టార్ల జీవితాలు మలుపు తిరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement