War Episode
-
యుద్ధం అంతుచూసేదాకా వదలను
ఖార్తూమ్: యుద్ధం అంతుచూసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంక్షుభిత సూడాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్ శనివారం ప్రకటించారు. దాంతో అక్కడి తమవారి భద్రతపై అమెరికా, బ్రిటన్, చైనా, తదితర దేశాలు ఆందోళనలో పడ్డాయి. కాల్పుల విరమణ యత్నాలు రెండుసార్లు విఫలమైన దరిమిలా బాంబుల మోతతో దద్దరిల్లుతున్న దేశం నుంచి బయటపడే మార్గంలేక విదేశీయులు బిక్కుబిక్కుమంటున్నారు. బాంబు దాడులు, కాల్పుల ఘటనల్లో ఇప్పటిదాక 400 మందికిపైగా మరణించారు. సూడాన్‌లో చిక్కుకున్న 16 వేల మంది తమ పౌరులను ఎలాగైనా రక్షిస్తామని అమెరికా శుక్రవారం ప్రకటించడం తెల్సిందే. -
లీకైన బాహుబలి 2 వీడియో
భారీ చిత్రాలకు లీక్‌ల బెడద తప్పటం లేదు. సాంకేతికత అభివృద్ది చెందుతున్న కొద్దీ, లాభాలతో పాటు నష్టాలు కూడా అదే స్ధాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమ లీకులు, పైరసీ మూలంగా తీవ్రంగా నష్టపోతోంది. తాజాగా మరోసారి టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ బాహుబలి 2కి సంబంధించిన వార్ సీన్ ఒకటి నెట్లో హల్చల్ చేస్తోంది. గతంలో బాహుబలి తొలి భాగం రిలీజ్‌కు ముందు కూడా ఇలాగే వార్ ఎపిసోడ్ లీక్ అవ్వటంతో చిత్రయూనిట్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నిచర్యలు తీసుకున్న లీకుల బెడద మాత్రం తప్పటం లేదు. తాజాగా బాహుబలి 2 విషయంలోనూ అదే జరిగింది. దాదాపు మూడు నిమిషాల వార్ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనుష్క, ప్రభాస్‌లపై చిత్రీకరించిన ఈ సీన్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి కాకుండానే నెట్లో ప్రత్యక్షమైంది. ఇప్పటికే చర్యలు మొదలు పెట్టిన చిత్రయూనిట్ నెట్లో వీడియోను డిలీట్ చేసినా.. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న వారి ద్వారా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరోవైపు బాహుబలీ యుద్ధ సన్నివేశాలు నిజంగా లీక్ అయ్యాయా లేక పబ్లిసిటీ స్టంటా అనే దానిపై సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి.