‘బాహుబలి’కి 100 రోజులు!
‘బాహుబలి’కి 100 రోజులు!
Published Mon, Jan 20 2014 12:03 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM
ఒక సినిమా వంద రోజులాడితే అది టాపిక్ అవుతుంది. కానీ, ఓ సినిమా షూటింగ్‌పరంగా వంద రోజులు పూర్తి చేసుకుంటే టాపిక్ అవుతుందా? ‘బాహుబలి’లాంటి భారీ చిత్రమైతే అది కచ్చితంగా న్యూస్ అవుతుంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై ఇప్పటికి వంద రోజులు పూర్తయ్యింది. ‘మా షూటింగ్ విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుంది’ అని రాజమౌళి ట్వీట్ చేశారు.
బాహుబలి, శివుడిగా ద్విపాత్రల్లో ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంలో రానా ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. బాహుబలికి జోడీగా దేవసేన పాత్రను అనుష్క, శివుడి జోడీ అవంతిక పాత్రను తమన్నా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆర్‌ఎఫ్‌సీలో రూపొందించిన భారీ సెట్స్‌లో జరుగుతోంది. క్లయిమాక్స్‌లో వచ్చే భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ ‘బాహుబలి’ రెండు భాగాలుగా విడుదలవుతుందని వినికిడి.
Advertisement
Advertisement