బాహుబలి 2 రిలీజ్ డేట్ | Baahubali - The Conclusion Release Date Announced | Sakshi
Sakshi News home page

బాహుబలి 2 రిలీజ్ డేట్

Published Wed, Mar 2 2016 2:50 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

బాహుబలి 2 రిలీజ్ డేట్ - Sakshi

బాహుబలి 2 రిలీజ్ డేట్

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు. ముందుగా ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించినా, భారీ గ్రాఫిక్స్తో పాటు షూటింగ్ పార్ట్ కూడా చాలా మిగిలి ఉండటంతో వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. 2017 ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి ద బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించటంతో పాటు 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న బాహుబలి 2 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునే స్థాయిలో మరింత ప్రతిష్ఠాత్మకంగా బాహుబలి 2 ను తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement