త్వరలోనే బాహుబలి-2 ట్రైలర్‌ వచ్చేస్తోంది! | Baahubali 2 trailer will be out on October 23 | Sakshi
Sakshi News home page

శరవేగంగా షూటింగ్‌.. బాహుబలి-2 ట్రైలర్‌

Published Mon, Sep 26 2016 5:18 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

త్వరలోనే బాహుబలి-2 ట్రైలర్‌ వచ్చేస్తోంది!

త్వరలోనే బాహుబలి-2 ట్రైలర్‌ వచ్చేస్తోంది!

ఒక మిస్టరీ.. ఒక ఆసక్తి.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలని యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. ఆ మిస్టరీ గుట్టు విప్పేందుకు రాజమౌళి టీమ్‌ కూడా శరవేగంగా శ్రమిస్తోంది.‍ ప్రస్తుతం హైదరాబాద్‌లో ’బాహుబలి-2’  షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. చకచకా సాగిపోతున్న షూటింగ్‌ మరో రెండు నెలల్లో నవంబర్‌ నెలాఖరు నాటికి పూర్తికానుందని సమాచారం. ’బాహుబలి: ద బిగినింగ్‌’కు మించి ’బాహుబలి: ది కన్‌క్లూజన్‌’లో యాక్షన్‌ సీన్లు ఉంటాయని చెప్తున్నారు.

ప్రస్తుతం రాజమౌళి బృందం క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తున్నది. ’బాహుబలి’ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్‌ 23న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయాలని చిత్రయూనిట్‌ భావిస్తున్నట్టు సమాచారం. బాహుబలిగా, శివగా ఈ సినిమాలో ప్రభాస్‌ రెండు పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. మొదటి పార్టు తరహాలోనే రెండో పార్టులోనూ కండలతో మాంఛి బలిష్టంగా కనిపించేందుకు ప్రభాస్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రభాస్‌-రాణా తమ స్ట్రాంగ్‌ ఫిజిక్‌ను మెయింటెన్‌ చేసేందుకు రోజుకు 40 ఎగ్‌వైట్‌లను తింటున్నట్టు కథనాలు వస్తున్నాయి.

'బాహుబలి' మొదటి సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 24 గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్‌ 40 లక్షల వ్యూస్‌ సాధించింది. ఇప్పుడు 'బాహుబలి-2' ట్రైలర్‌ కూడా ఇదేరకంగా సంచలనం సృష్టించే అవకాశముందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement