ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: రాజమౌళి | good news for prabhas fans on oct 5 says rajamouli | Sakshi
Sakshi News home page

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: రాజమౌళి

Published Fri, Sep 30 2016 8:39 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: రాజమౌళి - Sakshi

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: రాజమౌళి

హైదరాబాద్: ప్రభాస్ అభిమానులకు పెద్ద సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నామని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. అక్టోబర్ 5న ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందించబోతున్నామని చెప్పారు. ‘బాహుబలి 2’ సినిమా లోగోను శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రభాస్, రానాలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘గుడ్ న్యూస్ అంటే ప్రభాస్ పెళ్లనుకునేరు. అదికాదు. మా సినిమా పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని ప్రభాస్ చెప్పాడు. అతడి తర్వాత సినిమా ప్రకటన కూడా కాదు. అక్టోబర్ 22న బాహుబలి 2 ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నాం. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 23న మేకింగ్ వీడియో విడుదల చేస్తాం. సినిమా నెల ముందే వర్చవల్ రియాలిటీలో విడుదల చేస్తాం. ఇందులో సినిమా చూడడం అద్భుతంగా ఉంటుంద’ని రాజమౌళి అన్నారు. రెండు పాటలు, కొన్ని యాక్షన్ స్వీకెన్స్ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు.

బాహుబలి కామిక్ బుక్ విడుదల చేయబోతున్నామని హీరో ప్రభాస్ చెప్పాడు. హైక్వాలిటితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, ప్రతిఒక్క అంశంలో జాగ్రత్త తీసుకుంటున్నామని రానా దగ్గుబాటి తెలిపారు. అయితే అక్టోబర్ 5న ఏం గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని విలేకరుల పదేపదే అడిగినా రాజమౌళి సమాధానం దాటవేశారు. అదేంటో అదేరోజున వెల్లడిస్తామని మరింత ఆసక్తి రేపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement