
వీడని బాహుబలి ఫీవర్
తమిళనాట ‘బాహుబలి’ చిత్రం చాలా వరకు థియేటర్లలో గత వారం ఏప్రిల్ 28వ తేదీ విడుదలైంది. ఈ చిత్రం తమిళంలో విడుదల అవుతుందా లేదా అనే చర్చలు కొనసాగినప్పటికీ, ఆ రోజు ఉదయం షోనే విడుదలైంది. ప్రత్యేక షోలను రద్దు చేశారు. ఆ చిత్ర తొలి సన్నివేశం నుంచే పాజిటివ్ అయిన సమాచారాలు వెల్లడికావడంతో ‘బాహుబలి’ తమిళంలో కూడా పెద్ద స్థాయిలో విజయం సాధించింది.
ఇక్కడ కూడా రూ.100 కోట్లను దాటే అవకాశాలు అధికంగానే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్లలో వచ్చే ఆదివారం వరకు బాహుబలి రిజర్వేషన్‌లో పూర్తి కావడంతో శుక్రవారం విడుదల కావాల్సిన ఎయ్‌దవన్, తొండన్ వంటి పలు చిత్రాల విడుదలను తర్వా త వారానికి వాయిదా వేశారు. అభిమానులకు బాహుబలి ఫీవర్ పట్టుకోవడంతో వారు ఇత ర సినిమాలను చూడడానికి వస్తారా అనే సందేహం నెలకొంది.
లోబడ్జెట్ చిత్రాల సాహసం: అయినప్పటికీ కొన్ని లోబడ్జెట్ చిత్రాల విడుదలకు సాహసం చేశారు. వాటిలో అందాల తార దన్షిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఎంగ అమ్మా రాణి’ చిత్రంలో పాటు ‘ఆరంభమే అట్టగాసం‘, ‘మదిపెన్’, ‘విలయాడ వా’ వంటి చిత్రాలు ఉన్నాయి. వారం రోజుల తర్వాత అయినా బాహుబలి ఫీవర్ తగ్గుతుందనే నమ్మకంతో ఇరుక్క బయమేన్, తిరప్పు విళా’ వంటి చిత్రాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయినా అప్పటికి బాహుబలి చిత్రానికి అభిమానుల ఆదరణను బట్టి ఆ చిత్రల విడుదలలో కూడా మార్పులు ఉంటాయని సమాచారం.