'రైతు'గా బాలయ్య.. | Balakrishna 101st film named as 'Rythu' | Sakshi
Sakshi News home page

'రైతు'గా బాలయ్య..

Published Tue, Jun 28 2016 7:11 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

'రైతు'గా బాలయ్య..

'రైతు'గా బాలయ్య..

హిందూపూర్ (అనంతపురం జిల్లా) : నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలో 'రైతు'గా కనిపించనున్నారు. పలువురి రైతుల ఎదుట  స్వయానా బాలయ్యే తన 101వ సినిమా వివరాలను వెల్లడించారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా మంగళవారం రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. అదే వేదికపై తన 101 వ చిత్రం గురించి ప్రకటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందనున్న ఆ సినిమా పేరు 'రైతు' అని తెలిపారు.

బాలయ్య వరుస చిత్రాలు చేస్తుండటంతో అభిమానులు తెగ సంబర పడుతున్నారు. కాగా ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక 100 వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సెట్స్ మీదున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి బరిలో నిలువనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement