బాలయ్య కోసం భారీగా శత్రు గణం | Balakrishna Boyapati srinu Next Telugu Movie Latest Update | Sakshi
Sakshi News home page

భయంకరమైన విలన్స్‌ మధ్య బాలయ్య

Published Thu, May 14 2020 3:35 PM | Last Updated on Thu, May 14 2020 3:42 PM

Balakrishna Boyapati srinu Next Telugu Movie Latest Update - Sakshi

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఏ రేంజ్‌లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా అనౌన్స్‌మెంట్‌ నుంచి సోషల్‌ మీడియాలో ఈ చిత్రంపై అనేక వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కథ ఇదేనంటూ, బాలయ్య అఘోరగా నటిస్తున్నాడంటూ, విలన్‌ పాత్ర శ్రీకాంత్‌ పోషిస్తున్నాడని మొదట్నుంచి లీకువీరులు చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్‌డేట్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. 

కాగా ఈ చిత్రంలో బాలయ్యకి సవాల్ విసరడానికి భారీగా విలన్లను దించాలని బోయపాటి భావిస్తున్నాడట. ఇప్పటికే హీరో శ్రీకాంత్‌ను మెయిన్‌ విలన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు మర విలన్‌గా బాలీవుడ్‌కు చెందిన ఓ నటుడితో చిత్రబృందం సంప్రదింపులు జరిపనట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌కు బోయపాటి ప్లాన్‌ చేస్తున్నారట. అందుకోసం భారీ శత్రుగణాన్ని దర్శకుడు సిద్దం చేస్తున్నారని టాలీవుడ్‌ టాక్‌. ఇక అరవీర భయంకరమైన విలన్స్‌ మధ్య బాలయ్య యాక్షన్‌ ఘట్టాలు మామూలుగా ఉండవని సమాచారం. ఇక ఈ చిత్రానికి మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

చదవండి:
పెళ్లిపై సాయి పల్లవి షాకింగ్‌ కామెంట్స్‌
ఓ ఇంటివాడైన ‘రంగస్థలం’ మహేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement