‘లయన్’ రెడీ
‘‘బాలకృష్ణ అభిమానులకు ఈ సినిమా ఒక పండగే. కచ్చితంగా అందరి అంచనాలనూ అందుకునే స్థాయిలో ఈ చిత్రం రూపొందింది. ఇటీవల విడుదలైన పాటలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది’’ అని నిర్మాత రుద్రపాటి రమణారావు చెప్పారు. బాలకృష్ణ, త్రిష, రాధికా ఆప్టే కాంబినేషన్‌లో సత్యదేవా దర్శకత్వంలో, జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రూపొందుతోన్న ‘లయన్’ చిత్రం మే 8న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు సత్యదేవా మాట్లాడుతూ -‘‘బాలకృష్ణ గారి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో తెలుసు. అందరి ఆకాంక్షలనూ ఈ సినిమా నెరవేరుస్తుంది’’ అన్నారు. బాలకృష్ణ ఇందులో రిస్కు చేసి ఓ ఫైట్ చేశారని అలీ చెప్పారు. నటుడు సమీర్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ మాట్లాడారు.