పాపం... ప్రియాంకకు నిద్ర లేదట! | Baywatch have made Priyanka 'Obvilion of sleep' | Sakshi
Sakshi News home page

పాపం... ప్రియాంకకు నిద్ర లేదట!

Published Sat, May 14 2016 12:18 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

పాపం... ప్రియాంకకు నిద్ర లేదట! - Sakshi

పాపం... ప్రియాంకకు నిద్ర లేదట!

అవకాశాలు రానంత వరకు రాలేదని బాధపడతాం! ఒక్కసారిగా అవకాశాలు వెల్లువెత్తితే, క్షణం తీరిక లేదని ఇబ్బంది పడతాం. ఇది మానవ నైజం. హాలీవుడ్ దాకా ఎదిగిన మన భారతీయ నటి ప్రియాంకా చోప్రా ఇప్పుడు అచ్చంగా అలాంటి ఇబ్బందిలోనే ఉంది. ‘బేవాచ్’ సినిమా షూటింగ్‌తో ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీగా ఉన్న ప్రియాంకకు ఇప్పుడు నిద్ర చాలడం లేదట! వరుసగా రాత్రి వేళ షూటింగ్‌లతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఆమె వాపోయారు. ఆ మాటే ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

‘క్వాంటికో’ టీవీ సిరీస్‌తో హాలీవుడ్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన 33 ఏళ్ళ ప్రియాంక ‘బేవాచ్’ సినిమాలో విక్టోరియా లీడ్స్ అనే విలన్ పాత్ర పోషిస్తున్నారు. గతంలో టీవీ సిరీస్‌గా ఫేమస్ అయిన ‘బేవాచ్’ ఇప్పుడిలా సినిమాగా రూపొంది, వచ్చే ఏడాది మే 19న రిలీజ్ కానుంది. ‘బేవాచ్’ టీవీ సిరీస్‌లో నటించిన డేవిడ్ హ్యాజెల్‌హాఫ్, పామెలా ఆండర్సన్‌లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మొత్తానికి, ఒకపక్క బాలీవుడ్, మరోపక్క హాలీవుడ్ - రెండిటికీ సమన్యాయం చేయడానికి ప్రియాంకా చోప్రా తంటాలు పడడం అర్థం చేసుకోదగిందే. పేరు, డబ్బు రావాలంటే ఎవరైనా కష్టపడక తప్పదు కదూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement