లోకల్ డైరెక్టర్తో 'మంత్రిగారి అల్లుడు' | Bellamkonda Sai Sreenivas Next Mantri Gari Alludu | Sakshi
Sakshi News home page

లోకల్ డైరెక్టర్తో 'మంత్రిగారి అల్లుడు'

Published Thu, Apr 13 2017 9:51 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

లోకల్ డైరెక్టర్తో 'మంత్రిగారి అల్లుడు'

లోకల్ డైరెక్టర్తో 'మంత్రిగారి అల్లుడు'

అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాలతో నిరాశపరిచిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను  ప్లాన్ చేస్తున్నాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ లాంటి సక్సెస్ చిత్రాలతో ఆకట్టుకున్న త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాకు మంత్రిగారి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా తెలుగు, తమిళ భాషలకు చెందిన పలువురు సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement