కోలీవుడ్‌లో బెంగాలీ బ్యూటీ ఉపాసన | Bengali Buety In Kollywood Movie | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో బెంగాలీ బ్యూటీ

Published Wed, Jun 27 2018 7:57 AM | Last Updated on Wed, Jun 27 2018 7:57 AM

Bengali Buety In Kollywood Movie - Sakshi

తమిళసినిమా: ఇండియాలోని ఢిల్లీ, ముంబై, కేరళ, కన్నడం, తెలుగు, గుజరాతి, పంజాబి ఇలా పలు రాష్ట్రాల అందాలరాశుల దృష్టి అంతా కోలీవుడ్‌పైనే అన్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ భాషా భేషజాలకు పోకుండా ప్రతిభకు పట్టం కట్టడమే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. అదేవిధంగా సినిమా తొలి రోజుల్లో నటీనటులను రంగస్థల నటనానుభవం సినిమాలకు దగ్గర చేసేది. ఈ ఆధునిక రంగంలో ట్రెండ్‌ మారింది. బుల్లితెర, అందాల పోటీలు, మోడలింగ్‌ రంగాలు వెండితెరకు వారధిగా మారుతున్నాయి. ముఖ్యంగా నటీమణులు అందాలపోటీల్లో కిరీటాలను గెలుచుకుని, మోడలింగ్‌ రంగంలో రాణిస్తూ సినీ కథానాయకిలుగా ప్రమోట్‌ అవుతున్నారు. అలా తాజాగా హీరోయిన్‌ చాన్స్‌ కొట్టేసిన బెంగాలీ బ్యూటీ ఉపాసన. ఆర్‌సీ.ఈ ముద్దుగుమ్మ ‘88’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయకిగా రంగప్రవేశం చేసింది. అయితే అంతకుంటే ముందే కన్నడ చిత్ర రంగప్రవేశం చేసింది. తమిళంలో ‘88’ చిత్రం కంటే ముందుగా ఉపాసన నటించిన మరో చిత్రం ట్రాఫిక్‌ రామస్వామి తెరపైకి రావడం విశేషం.

అందుకే ఈ భామ నాకు ఎంట్రీ ఇచ్చింది ‘88’ చిత్రం అయితే గుర్తింపునిచ్చింది ట్రాఫిక్‌ రామస్వామి చిత్రం అని సంబరపడిపోతోంది. ఇంతకీ ఈ సుందరి పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం. అమ్మానాన్నల పుట్టిన ఊరు బెంగాల్‌. నేను పుట్టింది మాత్రం గుజరాత్‌లో. ఇప్పుడు ఉంటోంది తమిళనాడులో. ఇక ఇండియా మొత్తం ఒక రౌండ్‌ చుట్టిరావలన్నది నా ఆశ. నాన్న మెకానికల్‌ ఇంజినీర్‌.అమ్మ పాఠశాల ప్రధాన అధ్యాపకురాలగా విధులు నిర్వహించి ప్రస్తుతం నాకు తోడుగా ఉంటున్నారు. నాకు చిన్నతనం నుంచి నటన అంటే చాలా ఇష్టం. అందుకే భరతనాట్యం, క్లాసికల్‌ డాన్స్‌ నేర్చుకున్నాను. 2015లో ఆల్‌ ఇండియా స్థాయిలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొని మిస్‌ ఇండియా కిరీటాన్ని పొందాను. 80కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాను. విజయ్‌ టీవీలో ప్రసారం అయిన విల్లా టూ విలేజ్‌ కార్యక్రమం నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ కార్యక్రమం నాకు రియల్‌ ఫైటర్‌ అనే పట్టం ఇచ్చింది. అలా కన్నడ, తమిళ చిత్రాల్లో పరిచయం అయ్యాను. ట్రాఫిక్‌ రామస్వామి లాంటి మంచి కథా చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం నాకు చాలా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. మంచి కథానాయకిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం.  నటుడు సిద్ధార్థ్‌ అంటే చాలా ఇష్టం. నేను ఒక డాన్సర్‌ను కాబట్ట నటుడు విజయ్‌ డాన్స్‌ అంటే ఇంకా ఇష్టం. ప్రస్తుతం నటిస్తున్న కరుత్తుగళై పదివు సెయ్‌ చిత్రం నాకు మరింత గుర్తింపును తెచ్చి పెడుతుందనే నమ్మకం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement