దుబాయ్‌లో ‘బాహుబలి’ సందడి | bhahubaali fest in dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో ‘బాహుబలి’ సందడి

Published Tue, Jan 19 2016 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

దుబాయ్‌లో ‘బాహుబలి’ సందడి

దుబాయ్‌లో ‘బాహుబలి’ సందడి

 రెండేళ్లుగా దుబాయ్‌లోని తెలుగువారిని ఉర్రూతలూగిస్తున్న ‘గల్ఫ్ ఆంధ్రా మ్యూజికల్ అవార్డ్స్’ (గామా) వేడుక ఈసారి ఫిబ్రవరి 12న జరగనుంది. దుబాయ్‌లో జరగనున్న ఈ అవార్డు ప్రదానోత్సవంలో హీరో ప్రభాస్, తమన్నా, ‘బాహుబలి’ చిత్ర నిర్మాత  శోభూ యార్లగడ్డ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన  కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.  ఈ సందర్భంగా గామా అవార్డ్స్ నిర్వాహకుడు కేసరి మాట్లాడుతూ- ‘‘ప్రతి ఏడాది సంగీత విభాగానికే అవార్డులు అందిస్తూ వచ్చాం. ఈ సారి బెస్ట్ మూవీ విభాగాన్ని ప్రవేశపెట్టాం. ‘బాహుబలి’ ఈ అవార్డ్‌కి ఎంపికైంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు కోటి, ఎమ్.ఎమ్ శ్రీలేఖ, రచయిత చంద్రబోస్, నిర్మాత శోభు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement