bhahubali
-
కాబోయే భర్తను పరిచయం చేసిన ‘బాహుబలి’ సింగర్..ఫోటో వైరల్
ప్రముఖ సింగర్ సత్య యామిని త్వరలోనే పెళ్లి పీటకెక్కనుంది. తాజాగా ఆమె తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తూ ‘జీవిత కాలానికి సంబంధించిన రోలర్ కోస్టర్ వేచి ఉంది’ అని రాసుకొచ్చింది. 'బహుబలి'లోని ఫేమస్ సాంగ్ మమతల తల్లి ద్వారా సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సత్య యామిని. ఆ ఒక్క పాటని ఆమె జీవితాన్నే మార్చేసింది. బాహుబలి తర్వాత యామినికి వరుస అవకాశాలు వచ్చాయి. శైలజారెడ్డి, అల్లుడు, కొండపొలం, రాధేశ్యామ్, బింబిసార, అఖండ తదితర సినిమాల్లో ఆమె పాటలు పాడింది. కాగా, కాబోయే భర్తను పరిచయం చేసిన యామినికి తోటి సింగర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గీతా మాధురి, అనుదీప్, మనీషాలతో పాటు పలువురు సింగర్స్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ పెట్టారు. View this post on Instagram A post shared by Satya Yamini (@satya.yamini) -
ప్రభాస్ గుర్రం.. పరుగు తీస్తే పతకమే
సంధించిన బాణంలా దూసుకుపోతుంది. పరుగుల వేట ప్రారంభిస్తే పతకాలు కొల్లగొట్టి తీరుతుంది. అభినందనల నీరాజనాన్ని అందుకుంటుంది. ఆ పంచకల్యాణి కోసం జన సందోహం తరలి వస్తుంది. గుర్రాలంటే అమితాసక్తి ఉండేవారు కొందరు.. గుర్రాలను సాకుతూ పోటీల్లో విజేతగా నిలిచేవారు ఇంకొందరు. రెండో కోవకు చెందుతాడు అలమండ సంతకు చెందిన పి.శ్రీనివాసరాజు పోటీకెళ్తే బహుమతి ఖాయం చిన్నప్పటి నుంచి గుర్రాలంటే మక్కువ ఉన్న శ్రీనివాసరాజు.. వాటిని కొనుగోలు చేసి పెంచడం ప్రారంభించాడు. గుర్రాల స్వారీ కూడా నేర్చుకున్నాడు. గ్రామాల్లో జాతరలు, తీర్థాలు జరిగితే గుర్రాపు పందాలు నిర్వహిస్తున్నాడు. ఏ పందాలకు వెళ్లినా అతని గుర్రాలు మొదటి, ద్వితీయ స్థానంలో నిలుస్తున్నాయి. గుర్రాలపై మక్కువతోనే రాజస్థాన్, కర్ణాటక, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లి గుర్రాలను కొని పెంచుతున్నాడు. ప్రస్తుతం శ్రీనివాసరాజు వద్ద 5 గుర్రాలున్నాయి. బాహుబలి గుర్రం కొనుగోలు బాహుబలి చిత్రంలో ప్రభాస్ స్వారీ చేసిన గుర్రాన్ని ఇటీవల కొనుగోలు చేశాడు. ప్రస్తుతం బాహుబలి గుర్రం కూడా అతని వద్దే ఉంది. ఒక్కొక్క గుర్రాన్ని రూ.లక్ష నుంచి రూ.లక్ష 50 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేశాడు. ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న జాతరలు, తీర్థ మహోత్సవాలు, గ్రామదేవత ఉత్సవాలకు గుర్రాపు పందాలపై ఆసక్తి పెరిగింది. దీంతో గుర్రపు పందాలను తిలకించడానికి భారీగా వస్తున్నారు. శ్రీనివాసరాజు గుర్రాలు ఏ పోటీలకు వెళ్లినా ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలుస్తున్నాయి. అతని గుర్రాలు సుమారు 30 పోటీల్లో పాల్గొని విశాఖ, తూర్పుగోదావరి, విజయగనరం జిల్లాల్లో జరిగిన గుర్రపు పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి. ప్రస్తుతం శ్రీనివాసరాజు వద్ద రాణి, చెర్రీ, బాహుబలి, విజిలి, బుల్లెట్‌రాజా పేర్లున్న గుర్రాలున్నాయి. గుర్రాలకు రోజూ ఉదయం, సాయంత్రం స్వారీపై తర్ఫీదు ఇస్తాడు. రోజు తప్పించి రోజు ఈత కొట్టిస్తాడు. ఎండాకాలంలో రోజూ చల్లని నీటితో స్నానం చేయిస్తాడు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ వినియోగించిన గుర్రం గుర్రాల ఆహారం రోజూ గుర్రాలకు క్యారెట్, బీట్రూట్, నల్ల ఉలవలు, నువ్వులతో తయారుచేసిన అరిసెలు, కర్జూరం, తాటిబెల్లం, గోధుమలు, పచ్చగడ్డివి పెడతాడు. వాటితోపాటు కాల్షియం టానిక్ ఇస్తాడు. ప్రత్యేక గుర్రపు వైద్య నిపుణుడితో ఎప్పటికప్పుడు వైద్యం అందిస్తాడు. – జామి (శృంగవరపుకోట) బాల్యం నుంచి మక్కువ చిన్నప్పటి నుంచి గుర్రాలంటే చాలా మక్కువ. ప్రస్తుతం నావద్ద అయిదు గుర్రాలున్నాయి. ఇటీవలే బాహుబలి చిత్రంలో ఉపయోగించిన గుర్రాన్ని కొనుగోలు చేశాను. వీటి పెంపకానికి అధిక వ్యయం అవుతుంది. ఒక్కొక్క గుర్రానికి నెలకు సుమారు రూ.8వేలు అవుతుంది. నా అభిరుచి పదిమందికి ఆనందాన్నివ్వడం సంతోషంగా ఉంది. – పి.శ్రీనివాసరాజుఅలమండ సంత గుర్రపు స్వారీలో నాకు సుమారు 15 ఏళ్ల అనుభవం ఉంది. గుర్రపుస్వారీలపై శిక్షణ కూడా ఇస్తాను. అనేక పందాలకు వెళ్లాను. స్వారీలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గుర్రపు స్వారిలో కళ్లెం అతి ప్రధానమైనది. వాహనాలకు గేర్లు మాదిరిగానే కళ్లెం పనిచేస్తుంది.– బద్రీనాథ్, గుర్రపుస్వారి శిక్షకుడు -
మోకాళ్లపై నిల్చున్న ‘బాహుబలి’
సాక్షి, హైదరాబాద్ : బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు రెబల్ స్టార్ ప్రభాస్. సినిమాల్లో ఎంతో గంభీరంగా కనిపించే ప్రభాస్, నిజ జీవితంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. ప్రేమతో అందరిలో కలిసిపోతారు. ఇందుకు నిదర్శనం తాజాగా ఓ అభిమానితో దిగిన సెల్ఫీనే ఉదాహరణ. దివ్యాంగ అభిమానితో సెల్ఫీ దిగేందుకు మోకాళ్లపై నిల్చుని తన గొప్పతనం మరోసారి చాటుకున్నారు. విషయం ఏంటంటే.. ఇటీవల ఆయన అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన అభిమాన హీరో ప్రభాస్‌ని చూసేందుకు దివ్యాంగుడైన ఓ అభిమాని ఆకార్యక్రమానికి వచ్చారు. సెల్ఫీ దిగాలని ఉందని తన మనసులో కోరిక బయటపెట్టారు. ఆ అభిమాని చూపే ప్రేమకు ప్రభాస్ మనసు కరిగిపోయింది.. అభిమానికి సౌకర్యంగా ఉండేలా మోకాలిపై కూర్చుని అతని భుజంపై చేయి వేసి మరీ సెల్ఫీ తీసుకున్నారు. దీంతో, అభిమాని ఆనందానికి అవధులు లేవు. ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా షేర్ అవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సుజిత్ దర్శకుడు. శ్రద్ధా కపూర్ కథానాయిక. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. -
ప్రభాస్ ఎస్ అని చెబితే చాలు...
సముద్రంలో ఉప్పు ఉంటుంది జీవితంలో కూడా ఉప్పు ఉంటుంది అందుకే జీవితాన్ని భవసాగరం అంటారు. కష్టాల కడలిలో ఒక పడవను ఊహించుకుంటే.. ఆ పడవ కదలాలంటే.. తెరచాపకు గాలి తగలటం తప్పనిసరి. సాగరంలోని ఉప్పు తెలుస్తుంది గానీ గాలి కనపడదు కష్టాల నుండి తీరానికి చేర్చేది ఆ కనపడని దివ్య సమీరమే! ఇది మన ప్రయాణం.. మానవ ప్రయాణం. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నటుడు, పొలిటీషియన్ అయిన కృష్ణంరాజు గారి ఇంటికి ఉదయం 11 గంటల సమయంలో చేరుకున్నాం. హాలులో గణేషుడు, కృష్ణుడు విగ్రహాలు తీరుగా ఉన్నాయి. మరోవైపు కృష్ణంరాజుగారికి వచ్చిన అవార్డులు. లోపలి గుమ్మం మీద అయినవిల్లి వినాయకుyì చిత్రపటం. దాటుకొని లోపలకు అడుగుపెడితే ఎడమవైపున వేంకటేశ్వర లక్ష్మీసమేత ఆంజనేయ దేవతావిగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ఆ అలంకరణ, ధూపదీప నైవేద్యాలు చూస్తే అప్పుడే పూజ పూర్తయినట్టు ఉంది. కృష్ణంరాజుగారు వచ్చి కూర్చుంటూ ముందు ప్రసాదం.. తర్వాత ఇంటర్వ్యూ అన్నారు. సర్, ఇంట్లో పండుగ వాతావరణంలా ఉంది. ఈ రోజుకు ఏదైనా ప్రత్యేకత ఉందా? మా ఆవిడ (శ్యామలాదేవి) లక్ష్మీదేవివ్రతం జరుపుకుంది. మార్గశిర మాసంలో వచ్చే రెండో లక్ష్మీవారం మా ఇంట అమ్మవారి పూజ ఉంటుంది. పూజలు, వ్రతాలు.. దేవుడు అంటే మీకు నమ్మకాలు ఎక్కువే అనిపిస్తోంది. ఈ నమ్మకం, సంప్రదాయాలు మా ముత్తాతల కాలం నుంచి వస్తున్నవే! మా ఇలవేల్పు వేంకటే శ్వరస్వామి. రోజూ స్వామి పూజ తప్పనిసరి. అయితే, వేంకటేశ్వరస్వామి దర్శనానికి తరచూ తిరుమల వెళుతుంటారన్నమాట. తరచూ కాదు, రోజూ వెళుతుంటాను. గంట క్రితం కూడా తిరుమల ప్రయాణం చేసొచ్చాను. ఆ ప్రయాణంలోనే కైలాసగిరి, అన్నవరం, శిరిడీ, శబరిమలై కూడా వెళ్లొచ్చాను. అదో అద్భుతమైన టూర్ ట్రావెల్ అనుకోండి. ఇన్ని దేవాలయాలు ఇప్పుడే చూసొచ్చారా, అదెలా? ధ్యానంలో..! నాకు శివుడు అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లోనే శివయ్య పరిచయం అయ్యాడు. ధ్యానంలో అలా కైలాసగిరికి వెళ్లి స్వామిని దర్శించుకొని, తిరుమల వెంకన్నస్వామిని చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించుకొని అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరకు వెళతాను. అక్కడి నుంచి శిరిడీ వెళ్లి బాబా హారతిలో పాల్గొని శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శిస్తే .. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఈ ధ్యానప్రయాణంలో శరీరం అంతా తేలికైన భావన. పాజిటివ్ ఎనర్జీ ఒంటిని, మనసును తేజోవంతం చేస్తుంది. టికెట్ లేకుండా రోజూ ఉచిత దర్శనాలు చేసుకువస్తుంటారని మా ఇంట్లో సరదాగా అంటుంటారు (నవ్వుతూ) ధ్యానంలో టెంపుల్ జర్నీ ఎలా మొదలైంది? ఏ గురువులు దీనిని మీకు పరిచయం చేశారు? నా ఎనిమిదో ఏట అనుకుంట మా దూరపు బంధువుల్లో ఒక యోగి ఉండేవారు. ఆయన నాకు యోగ విద్యను నేర్పించారు. రోజూ ప్రాణాయామం వంటివి ఇష్టంతో సాధన చేసేవాడిని. సినిమా పరిశ్రమకు వచ్చాక మాత్రం ధ్యానం నా అనుభవంలోకే వచ్చింది. ధ్యానంలో ఆలయ సందర్శన చేస్తున్నారు సరే, ప్రత్యక్షంగా ఏయే ఆలయాలను సందర్శించారు? చాలా ఆలయాలను సందర్శించాను. తిరుమలకు కనీసం 50 సార్లు వెళ్లుంటాను. అన్నవరం సత్యనారాయణ స్వామి, శబరిమలై, శిరిడీ తరచూ వెళుతుంటాను. నియమనిష్టలతో కూడిన అయ్యప్ప దీక్ష 12 సార్లు తీసుకున్నాను. శబరిమలైలో అయ్యప్ప దర్శనం అద్భుతం. వెళితే రోజంతా గుళ్లోనే ఉండిపోతాను. ధ్యాన ప్రయాణంలో దైవాన్ని దర్శించే మీరు దైవానికి కోపం కలిగిందని ఎప్పుడైనా భావించారా? సినిమాల్లోకి వచ్చిన మొదట్లో గమనించాను. నా పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు. మూవీ అసోసియేషన్‌లో కుదించి ‘కృష్ణంరాజు’ అని రిజిస్ట్రేషన్ చేయించాను. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు. మా ఊళ్లో ఒకతను ‘మీ కులదైవం వేంకటేశ్వరస్వామి. నీ పేరులో ముందున్న ‘వెంకట’ అనే పేరు తీసేశావు.. అందుకే ఈ సమస్యలు’ అన్నాడు. నాకూ అది నిజమే అనిపించింది. కొన్ని తరాల నుంచి ‘వెంకట’ అని మా ఇంట్లో అందరికీ వారి వారి పేర్ల ముందు ఉంటుంది. నేను తీసేయడంతో అది నాకు కలిసిరాలేదు. పేరుకు ముందు మళ్ళీ ఇంటిపేరు(యు), వెంకట(వి) జత చేసుకున్నప్పడు నా ఎదుగుదలలో మంచి మార్పులు చూశాను. మీలో భక్తి అప్పటి నుంచే మొదలైందా? చిన్నతనంలోనే! నా వయసు అప్పుడు పద్నాలు గేళ్లనుకుంట. ఊళ్లో ఒక పెద్దావిడ చందాలు పోగు చేసి సాయిబాబా గుడి కట్టించింది. స్నేహితులతో కలిసి రోజూ ఆ గుడికి వెళ్లేవాడిని. అప్పుడు సాయి బాబా మీద నమ్మకం ఏర్పడింది. నాన్న గారూ దైవానికి సంబంధించిన విషయాలు చెబుతుండే వారు. మా నాన్న అంటే భయమే కాదు, భక్తి కూడా! దేవుడి కంటే కూడా మా నాన్నే గొప్ప. దేవుడికన్నా తండ్రి గొప్ప.. అనే నిర్ణయం తీసుకోవడానికి కారణం? క్రమశిక్షణ, నియమ నిబంధనల విషయంలో నాన్న కటువుగా ఉండేవారు. చిన్న పొరపాటు చేసినట్టు తెలిసినా సహించేవారు కాదు. అలాంటిది, నేను పాతికేళ్ల వయసులో మద్రాసులో సినిమాల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆయన నాకో ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో మరో ఉత్తరం జత చేసి ఉంది. అందులో నా గురించి ఎవరో తప్పుగా ‘మీ వాడు చెడు తిరుగుళ్ళు తిరుగుతు న్నాడు... మీ శ్రేయోభిలాషి’ అని ఉంది అందులో. ఆయన నన్ను తప్పుబట్టకుండా ‘ఇలాంటివాళ్లను నీ దగ్గరకు రానీయకు. జాగ్రత్తపడు’ అని రాశారు. ఆయన నాకు క్రమశిక్షణ, ప్రేమ, స్నేహాన్ని పంచాడు. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే! సినిమా పరిశ్రమకు వచ్చాక శివారాధకుడిగా మారాను అన్నారు అదెలా? మద్రాస్‌లో ఉన్నప్పుడు మైలాపూర్‌లోని శివాలయానికి తరచూ వెళ్లేవాడిని. అభిషేకం, హారతి సమయాలలో అద్భుతమైన అనుభూతికి లోనయ్యేవాడిని. అప్పుడే శివుడి మీద సినిమా తీయాలని గాఢంగా అనిపించింది. శివ మహాత్మ్యం పుస్తకంలో కన్నప్ప గురించి చిన్న కథ ఉంది. కన్నప్ప గిరిజనుడు, నాస్తికుడు, మూర్ఖుడు. అటువంటివాడు ఆస్తికుడిగామారి దైవానికి తన కళ్లు ఇస్తాడు. ఈ కథ గురించి చెబితే అంతా డిస్కరేజ్ చేశారు. యూత్ మీ సినిమాకే రారు అన్నారు. నమ్మి చేస్తే సక్సెస్ అవుతుందని పట్టుబట్టాను. అది నిజమైంది. దేవుళ్ల పాత్రలు, భక్తుడి పాత్రలు వేస్తున్నప్పుడు దైవానికి సంబంధించిన వైబ్రేషన్స్ వచ్చేవా? మేకప్ వేసుకున్నానంటే నాకు వేరే ఏదీ గుర్తొచ్చేది కాదు. ఆ పాత్రలో లీనమవుతాను. ఇక భక్తిరస సినిమాలైతే చెప్పక్కర్లేదు. భక్తకన్నప్పలో శివుడికి కన్ను ఇచ్చే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే! శరీరం, మనసులో ఏదో తెలియని ఉద్వేగం ఆవరించేది. భక్తి కష్టాలను అధిగమించడానికే అంటారా? కష్టాలు లేని జీవితాలు ఉండవు. శబరిమలై వెళుతున్నప్పుడు ‘కల్లుం ముళ్లుం కాలికి మెత్త..’ అంటారు మలయాళంలో. శబరిమల వెళుతున్నప్పుడు నడక దారిలో పదునైనా రాళ్లు, ముళ్లు ఉంటాయి. స్వామిని తలుచుకుంటూ వాటి మీదుగా నడిచేటప్పుడు కాలికి అవి మెత్తటి దిండులా అయిపోతాయి. ఈ రాళ్లు, ముళ్లు కాళ్లకే కాదు జీవితంలోనూ తగులుతూనే ఉంటాయి. కానీ, మనం వేసే అడుగు బలంగా ఉంటే అవి మెత్తబడిపోతాయి. పని చేస్తున్నప్పుడు ఈ రాళ్లు, ముళ్లు గుచ్చుకోకుండా ఉండటానికి భక్తి సాయపడుతుంది. పనిపట్ల ఏకాగ్రత, అంకితభావం పెరుగుతాయి. ఫలితంగా ఉన్నతి పెరుగుతుంది. ఈ విధానం మనం అవలంబిస్తే దీనిని చూసి మన పిల్లలు ఆచరిస్తారు. కులం, మతం, భాష.. ఏ తేడా లేదు. ఏ దేవుడైనా సరే, ఏ పద్ధతిలోనైనా సరే పూజ చేయి. నీకది జీవించడం ఎలాగో నేర్పుతుంది. మన పూర్వీకులు అందుకు కావల్సినంత సమాచారం మనకు అందించి వెళ్లారు. వాటిని సాధ్యమైనంతవరకు పాటిస్తూ, జీవితాన్ని అందంగా మలుచుకుంటూ దైవకృపను పొందాలి. జీవితమంతా ఇదే నేను ఆచరించింది. రాజకీయాల్లోకి రావడం దైవ నిర్ణయమేనా? మనం బలంగా అనుకుంటే దేవుడు కూడా హర్షిస్తాడు. ఒకసారి కాకినాడ ఆసుపత్రిని సందర్శించాను. లైట్లు కూడా సరిగ్గా లేక నరకంలా ఉండేది. రోగుల సమస్యలు చూసి చలించిపోయాను. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మేలు కలిగే పనులు చేయచ్చు అని భావించాను. అలాగే, రాజకీయాల్లోకి వచ్చాక ఆసుపత్రిని స్వర్గంలా మార్చాను. నా నియోజక పరిధిలోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాను. అభివృద్ధి పనుల గురించి అక్కడ ఎవర్ని అడిగినా ‘మా కృష్ణంరాజుగారు చేయించారు’ అని చెబుతారు. ఆ తృప్తి చాలు నాకు. మీ వైవాహిక జీవితం దైవం నిర్ణయించినదేనా? వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే దంపతుల ఇద్దరి నక్షత్రాల బట్టే ఆధారపడి ఉంటుంది. మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి మనజీవితం ఎలా ఉంటుందో జ్యోతిష్యం చెబుతుంది. నాది ఈశ్వరుని నక్షత్రమైన కృత్తిక, మా ఆవిడది అమ్మవారి నక్షత్రమైన స్వాతి. మొన్న కార్తీకమాసంలో ఓ టీవీ కార్యక్రమం వాళ్లు మా దంపతులచేత శివపార్వతుల కళ్యాణం చేయించారు. ప్రభాస్ పుట్టిన నక్షత్రం బట్టే అతని సక్సెస్ ఉందా? ఇది దైవ నిర్ణయమేనంటారా? నక్షత్రాన్ని బట్టి నువ్వు సంపన్నుడివి అవుతావు అని చెప్పవచ్చు. కానీ, ఎంత సంపాదిస్తావు అని చెప్పదు జ్యోతిష్యం. దైవ నిర్ణయంతో పాటు విజయానికి మన కృషి కూడా తోడవ్వాలి. సాధనను తపస్సులా చేయాలి. ప్రభాస్‌లో ఆ గుణం ఎక్కువ. బాహుబలి షూటింగ్ జరిగిన నాలుగేళ్లూ ఒక రుషిలా ఉండేవాడు ప్రభాస్. తపన, శ్రమ, అంకితభావం అన్నీ కలిస్తే దేవుడు కూడా దీవిస్తాడు. జాతకాలు కలవందే దంపతులు కలిసి ఉండరు అని చెప్పారు. మరి ప్రభాస్ పెళ్లికి ఇంకా ఎవరితోనూ జాతకాలు కలవలేదా? ప్రభాస్ పెళ్లికి ‘ఎస్’ అని చెబితే చాలు జాతకాలు చూడటం మొదలు పెడతాం. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాం. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
అదొక అద్భుతమైన అనుభూతి!
హాలీవుడ్ చిత్రాలను చూసినప్పుడు ఇలాంటి చిత్రాలు మన దేశంలో కూడా వస్తే బాగుండు అని కోరుకోనివారుండరు. ఆ స్థాయి చిత్రాలు తీయాలంటే వేల కోట్లు కావాలి కాబట్టి, అది సాధ్యం కాదని అనుకోనివారూ ఉండరు. అయితే మనం కూడా ఎందులోనూ తీసిపోమనీ, హాలీవుడ్ చిత్రాలను తలపించే రీతిలో తీయగలమనీ నిరూపించిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం జాతీయ అవార్డు సాధించిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరుల కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం ‘బాహుబలి 2’ నిర్మాణంలో ఉంది. వచ్చే ఏడాది ఈ రెండో భాగం విడుదల అవుతుంది. కాగా, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విడుదలైన తొలి భాగం ఇంకా అక్కడక్కడా కొన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. మ్యాట్నీ షోలో ఈ చిత్రాన్ని చూపిస్తున్నారు. మరో మూడు నెలలైతే ఈ చిత్రం విడుదలై ఏడాది అవుతుంది. ఇప్పటికీ ఆడుతోంది కాబట్టి, ఏయే థియేటర్లో ఈ చిత్రం ఆడుతోందో వాటిని ప్రభాస్ సందర్శిస్తే బాగుంటుందని ఆ థియేటర్ అధినేతలు అభిప్రాయపడుతున్నారట. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రభాస్‌కు పంపించారని సమాచారం. ఎగ్జిబిటర్ల ఆకాంక్షను స్వయంగా చదివిన ప్రభాస్ సానుకూలంగా స్పందించారట. ‘‘సినిమా పరిశ్రమలో థియేటర్ ఓనర్స్ పాత్ర చాలా ముఖ్యమైనది. వాళ్ల అభిప్రాయాలు ఎంతో విలువైనవి. ‘బాహుబలి’ విడుదలై ఏడాది కావస్తున్నా, ఇంకా ఈ చిత్రానికి అభినందనలు లభించడం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోంది’’ అని సన్నిహితులతో ప్రభాస్ అన్నారట. ఇదిలా ఉంటే.. ‘బాహుబలి’ తొలి భాగం అప్పుడు ఆ షూటింగ్ బిజీ వల్ల, ఇప్పుడు మలి భాగంతో బిజీగా ఉండటంవల్ల ప్రభాస్ పెద్దగా బయటకు రావడంలేదు. అప్పుడప్పుడూ ఏదైనా ఆడియో వేడుకలో కనిపించడం మినహా అభిమానులకు వేరే వేడుకల్లో కనిపించడంలేదు. అందుకని రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులను కలవాలనుకున్నారట. కొంతమంది అభిమానులకు ఇప్పటికే ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. అభిమానులందర్నీ ఒకేసారి కలవడం కుదరదు కాబట్టి, ఒక టీమ్‌ని ఏర్పాటు చేశారట. ఆ టీమ్ నిర్ణయించిన సమయాల్లో ఒక్కో గ్రూప్‌గా అభిమానులు విడిపోయి, ప్రభాస్‌ను ఆయన ఇంట్లోనే కలుస్తున్నారట. -
దుబాయ్‌లో ‘బాహుబలి’ సందడి
రెండేళ్లుగా దుబాయ్‌లోని తెలుగువారిని ఉర్రూతలూగిస్తున్న ‘గల్ఫ్ ఆంధ్రా మ్యూజికల్ అవార్డ్స్’ (గామా) వేడుక ఈసారి ఫిబ్రవరి 12న జరగనుంది. దుబాయ్‌లో జరగనున్న ఈ అవార్డు ప్రదానోత్సవంలో హీరో ప్రభాస్, తమన్నా, ‘బాహుబలి’ చిత్ర నిర్మాత శోభూ యార్లగడ్డ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా గామా అవార్డ్స్ నిర్వాహకుడు కేసరి మాట్లాడుతూ- ‘‘ప్రతి ఏడాది సంగీత విభాగానికే అవార్డులు అందిస్తూ వచ్చాం. ఈ సారి బెస్ట్ మూవీ విభాగాన్ని ప్రవేశపెట్టాం. ‘బాహుబలి’ ఈ అవార్డ్‌కి ఎంపికైంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు కోటి, ఎమ్.ఎమ్ శ్రీలేఖ, రచయిత చంద్రబోస్, నిర్మాత శోభు తదితరులు పాల్గొన్నారు. -
సమ్‌థింగ్ స్పెషల్ ఇయర్!
మరి మూడు రోజుల్లో 2015కు సెలవు చెప్పేస్తున్నాం. ఈ ఏడాది కాలాన్ని ఒక్కసారి రివైండ్ చేసి చూసుకుంటే, తెలుగు తెరపై కొన్ని తీపి గుర్తులు, మరికొన్ని చేదు మరకలు ఉన్నాయి. ఎన్ని సినిమాలొచ్చాయి, ఎవరెన్ని సినిమాల్లో చేశారు లాంటి కథ కాసేపు పక్కనపెడితే, చరిత్రలో నిలిచిపోయే కొన్ని విశేషాలు, విషాదాలు, ఫస్ట్‌టైమ్ రికార్డులకు ఈ 2015 సాక్షి. అలాంటి కబుర్లు కొన్నింటి ఫ్లాష్‌బ్యాక్... ♦ 2015 బాక్సాఫీస్ గలగలలకు ఓ అనువాద చిత్రం శుభారంభం పలికింది. ధనుష్ నటించిన తమిళ డబ్బింగ్ సినిమా ‘రఘువరన్ బీటెక్ ’ ఘనవిజయం సాధించింది. కమలహాసన్ ‘నాయకుడు’ తర్వాత నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ డబ్ చేసిన సినిమా ఇదే. ♦ దర్శకుడు రాజమౌళి ఓ సినిమాలో గెస్ట్‌గా కనిపించారు. చిత్రం పేరు ‘మన కుర్రాళ్లే’. వీరశంకర్ దర్శకత్వం వహించారు. ♦ {పముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలల ఆధారంగా ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలు రూపొందడం విశేషం. ‘శ్యాంగోపాల్ వర్మ’ చిత్రానికి ‘మిస్టర్ నో’ నవల ఆధారం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ జ్యోతిలక్ష్మి ’కి ‘మిసెస్ పరాంకుశం’ నవల బేస్. వంశీ 25వ సినిమా ‘వెన్నెల్లో హాయ్ హాయ్’కి మల్లాది నవల ‘మేఘమాల’ ఆధారం. ఆ సినిమా కూడా నిజానికి ఈ ఏడాదే విడుదల కావాల్సింది. కానీ విడుదల ఆలస్యమైంది. ♦ మీడియాకు చాలా దూరంగా ఉండే పవన్ కల్యాణ్ ఈ ఏడాది జనవరి 1న ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. కేవలం 24 గంటల్లోనే 91 వేల పైచిలుకు మంది ఈ ఖాతాను అనుసరించడం విశేషం. ♦ ఈ 2015 - తెలుగు సినిమాకు చాలా ద్రోహమే చేసింది. హేమాహేమీలను తనలో కలిపేసుకుంది. ముఖ్యంగా టాప్ కమెడియన్లను తన వెంట తీసుకుపోయి ప్రేక్షకులకు బోలెడంత విషాదాన్ని మిగిల్చింది. నటులు ‘ఆహుతి’ ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ, మాడా, కొండవలస, రంగనాథ్, ‘కళ్లు’ చిదంబరం, మనోరమ, నిర్మాతలు డి. రామానాయుడు, వీబీ రాజేంద్రప్రసాద్, ఏడిద నాగేశ్వరరావు, అట్లూరి రామారావు, సాంకేతిక నిపుణులు విన్సెంట్, శ్రీ, డీటీఎస్ మధుసూదన్ రెడ్డి, ఎంఎస్ విశ్వనాథన్, గాయకుడు వి. రామకృష్ణ, రచయితలు గణేశ్‌పాత్రో, సత్యమూర్తి, శ్రీనివాస చక్రవర్తి, కాశీ విశ్వనాథ్ తదితరులు దివంగతులయ్యారు. ♦ తలుచుకుంటే తెలుగులోనూ మల్టీస్టారర్లు మళ్ళీ సాధ్యమేనని ‘గోపాల గోపాల’ నిరూపించింది. హిందీ ‘ఓ మై గాడ్’కు రీమేక్‌గా వెంకటేశ్, పవన్‌కల్యాణ్ కాంబినేషన్లో ఇది రూపొందింది. హిందీ నటుడు మిథున్ చక్రవర్తి కనిపించిన తొలి తెలుగు సినిమా ఇదే. ♦ ‘ఈ’ టీవీ, జెమినీ టీవీ కలసి సంయుక్తంగా ‘ బీరువా’ అనే సినిమా నిర్మించాయి. ఇందులో సందీప్ కిషన్ హీరోగా చేశారు. ♦ ఈ ఏడాది రీమిక్స్ సాంగ్స్ బాగానే వచ్చాయి. బాలకృష్ణ ‘రౌడీ ఇన్స్పెక్టర్’ లోని ‘అరె ఓ సాంబా...’ పాటను కల్యాణ్‌రామ్ ‘పటాస్’ కోసం రీమిక్స్ చేశారు. చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 786’లోని ‘ గువ్వా గోరింకతో ’ పాటను ‘ సుబ్రమణ్యం ఫర్ సేల్’ లో రీమిక్స్ చేశారు. ♦ నటుడు కోట శ్రీనివాసరావు ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్నారు. ♦ తమిళ ‘సూదు కవ్వమ్’కు రీమేక్‌గా రూపొందిన రాజశేఖర్ ‘గడ్డం గ్యాంగ్’లో సంగీత దర్శకుడు అచ్చు మెయిన్ రోల్ చేశారు. ♦ ఎప్పుడూ సొంత కథలతోనే సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ తొలిసారిగా బయటివాళ్ల కథతో ‘టెంపర్’ చేశారు. వక్కంతం వంశీ రచయిత. ఓ సీన్లో పూరీ యాక్ట్ చేశారు. ♦ నిఖిల్ నటించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ లో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఓ పాటలో ముస్లిమ్ గెటప్‌లో షాయిరీ పాడుతూ నటించారు. కమలహాసన్ చాలా కాలం తరువాత తెలుగు, తమిళాల్లో ఏకకాలంలో తీసిన ‘చీకటి రాజ్యం’లో రచయిత అబ్బూరి రవితో కలసి కాసేపు తెరపై పాత్రల్లో మెరిశారు. ♦ ‘సచిన్’ (‘టెండూల్కర్ కాదు’ క్యాప్షన్) చిత్రంలో మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ లీడ్ రోల్ చేశారు. ♦ హీరో నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘జెండాపై కపిరాజు’ చిత్రాలు ఒకే రోజు (మార్చి 21) విడుదల కావడం విశేషం. ‘ఎవడే సుబ్రమణ ్యం’లో కృష్ణంరాజు, ‘షావుకారు’ జానకి, ప్రతాప్ పోతన్ లాంటి సీనియర్ తారలు చాలాకాలం తర్వాత తెరపై కనిపించారు. ♦ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఏడు కథలతో తీసిన ‘చందమామ కథలు’ జాతీయ స్థాయిలో తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ♦ దర్శక-నిర్మాత వై.వి.ఎస్. చౌదరి సారథ్యంలో సుమారు నాలుగేళ్ళు నిర్మాణంలో ఉన్న ‘రేయ్ ’ ఈ ఏడాది విడుదలైంది. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తే జ్కి హీరోగా ఇదే తొలి చిత్రం. అయితే దీని కన్నా ముందే ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఇదే ఏడాది విడుదలైంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ హిందీ చిత్రంలో ఎండ్ టైటిల్స్‌లో రజనీకాంత్‌పై స్పెషల్ సాంగ్ వచ్చినట్లే, ఇందులో పవన్ కల్యాణ్‌పై ‘పవనిజం’ సాంగ్ చేశారు. వై.వి.ఎస్. ‘దేవదాస్’ ద్వారా పరిచయమైన హీరో రామ్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ♦ నిర్మాణం నుంచి ప్రదర్శన దాకా అన్నీ డిజిటల్మయమైపోయిన ఈ రోజుల్లో ‘జిల్’, ‘రేయ్’ చిత్రాలను కొంత ఫిల్మ్ నెగిటివ్‌లో షూట్ చేసి, తీశారు. తెలుగులో నెగిటివ్‌ను చిత్రీకరణకు ఉపయోగించిన ఆఖరి సినిమాలు ఇవే. ♦ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్‌తో మణిరత్నం తీసిన ‘ఓకే బంగారం’ తెలుగు వెర్షన్లో హీరోకు నాని డబ్బింగ్ చెప్పారు. ♦ కమలహాసన్ ‘ఉత్తమ విలన్’ చిత్రంలో సీనియర్ దర్శకులు కె.బాలచందర్, కె. విశ్వనాథ్‌లు ఇద్దరూ నటించారు. బాలచందర్ పాత్రకు తెలుగులో మిమిక్రీ కళాకారుడు హరికిషన్ డబ్బింగ్ చెప్పారు. ♦ ‘దొంగాట’ చిత్రంలో ‘ఏందిరో... ఈ మగాళ్లు ’ పాటను మంచు లక్ష్మీ ప్రసన్న స్వయంగా ఆలపించారు. ఈ సినిమాలో ఒక పాటలో నాగార్జున, రవితేజ, నాని, రానా, సుశాంత్, సుధీర్‌బాబు, నవదీప్, శింబు గెస్ట్లుగా కనిపిస్తారు. ♦ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి చాలా ఏళ్ల క్రితం ‘కళ్లు’ సినిమాలో ‘తెల్లారింది లెగండోయ్... కొక్కొరోకో ’ పాట పాడారు. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో పాడారు. ఈ ఏడాది దర్శకుడు క్రిష్ నిర్మించిన తమిళ ‘శైవమ్’ రీమేక్ ‘దాగుడుమూత దండాకోర్’లో ఒక పాటలో సీతారామశాస్త్రి గొంతు వినవచ్చు. ఈ సినిమాలో 4 పాటలను సంగీత దర్శకుడే (ఇ.యస్ మూర్తి) రాశారు. ♦ ‘మోసగాళ్లకు మోసగాడు’ లో హీరో సుధీర్‌బాబు కొడుకు మాస్టర్ చరిత్ మానస్ నటించారు. ♦ పెళ్లి నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ తొలిసారిగా ‘365 డేస్’ అనే సినిమా చేశారు. ఇందులో ‘వద్దురా... పెళ్లి వద్దురా...’ పాటను పోసాని కృష్ణమురళి స్వయంగా ఆలపించారు. ♦ పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాశ్ మరాఠీ చిత్ర రీమేక్ ‘ఆంధ్రా పోరి’తో హీరో అయ్యారు. ♦ తెలుగు, తమిళాల్లో నేరుగా, మలయాళ, హిందీ భాషల్లో అనువాద చిత్రంగా అంగరంగ వైభవంగా ‘బాహుబలి’ విడుదలైంది. సోషల్ మీడియాలో కీలక సమాచారం సెలెక్టెడ్ లీకులతోనే కావాల్సినంత ప్రచారం పొందిన ఈ చిత్రం ‘రేపే విడుదల’, ‘నేడే విడుదల’ లాంటి యాడ్స్ ఏమీ లేకుండా విడుదలై, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తెలుగు సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఏ సినిమాకూ జరగనంత వ్యాపారం, రానన్ని వసూళ్ళు సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్, తమన్నాలపై చిత్రీకరించిన ‘పచ్చబొట్టేసినా...’ పాటను ఇటీవల యూ ట్యూబ్‌లో విడుదల చేస్తే కోటిన్నర క్లిక్‌లు వచ్చాయి. ♦ చాలా విరామం తర్వాత శ్రీదేవి ‘పులి’ అనే దక్షిణాది చిత్రంలో నటించారు. ఈ తమిళ చిత్రం తెలుగులోనూ రిలీజైంది. ♦ రామ్‌చరణ్ ‘బ్రూస్లీ’లో చిరంజీవి గెస్ట్ వేషం వేశారు. చిరంజీవి 8 ఏళ్ల తర్వాత తెరపై కనబడి, 150వ చిత్రం మైలురాయి చేరుకున్నారు. ఇక హీరోగా పూర్తిస్థాయిలో నటించే 151వ సినిమానే బాకీ. ♦ అఖిల్ అక్కినేని తొలి చిత్రం ‘అఖిల్’లో ఆఖరి పాటలో నాగార్జున తళుక్కున మెరిశారు. హీరో నితిన్ ఈ సినిమా నిర్మించడం విశేషం. ♦ ఉత్తరాది సంస్థ రాజశ్రీ వారు సల్మాన్‌ఖాన్‌తో తీసిన ‘ప్రేమ్ రతన్ ధన్‌పాయో’ను తెలుగులో ‘ప్రేమ్‌లీల’గా డబ్ చేశారు. దీనిలో సల్మాన్‌ఖాన్‌కు హీరో రామ్‌చ రణ్ డబ్బింగ్ చెప్పారు. ♦ కమల్‌హాసన్ చాలా ఏళ్ల తర్వాత తెలుగులో డెరైక్ట్‌గా ‘చీకటిరాజ్యం’ సినిమా చేశారు. ♦ ‘ఈ సినిమా సూపర్‌హిట్ గ్యారెంటీ’ అనే సినిమాలో రెండు పాటలను దర్శకుడు వంశీ స్వరపరిచారు. ఇందులో ఓ పాత్రను దర్శకుడు దేవీప్రసాద్ పోషించారు. ♦ ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, కష్టపడి స్వయంగా బరువు పెరిగిన ‘సైజ్ జీరో’-ఇలా ఒకే ఏడాది మూడు విభిన్న తరహా చిత్రాల్లో నటించి, హీరోయిన్ అనుష్క ఏడాది పొడుగూతా వార్తల్లో నిలిచారు. ♦ దర్శకుడు గుణశేఖర్ జీవితాన్ని పణంగా పెట్టి, తెలుగువారి చరిత్రయిన కాకతీయ సామాజ్య్ర కథను ‘రుద్రమదేవి’గా అందించారు. భారతదేశంలో స్టీరియోస్కోపిక్ త్రీడీలో తయారైన తొలి చారిత్రక కథా చిత్రం ఇదే. ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం వినోదపు పన్నును మినహాయించింది. అమరావతి సహా దక్షిణాదిలో చాలాభాగాన్ని పాలించిన రుద్రమదేవి వెండితెర చరిత్రపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కరుణ చూపించలేదు. ♦ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కోసం త్రీడీలో డిజిటల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇలా చేయడం ఇండియాలో ఇదే ప్రథమం అట. ♦ సింగిల్ కేరెక్టర్‌తో ‘పంచమి’ సినిమా (నటి వేద) వచ్చింది. ♦ బాలకృష్ణ ‘లెజెండ్’ చిత్రం ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరుల్లో రోజుకు 4 ఆటలతో స్వర్ణోత్సవం జరుపుకొంది. ప్రదర్శన రంగంలో డిజిటల్ విధానం వచ్చాక ఇన్ని రోజులు ఓ సినిమా ప్రదర్శితమవడం దేశంలోనే ఇది తొలిసారి. ♦ విమర్శకుడు కత్తి మహేశ్ డెరైక్ట్ చేసిన ‘పెసరట్టు ’ - క్రౌడ్ ఫండింగ్‌తో చేసిన తొలి తెలుగు చిత్రంగా మిగిలింది. ♦ ‘నాగ భైరవి’ పేరుతో ఒక త్రీడీ డబ్బింగ్ హారర్ ఫిల్మ్ రిలీజైంది. తెలుగులో తొలి హారర్ త్రీడీ ఫిల్మ్ ఇదే. ♦ మొత్తం తెలంగాణ తారలు, సాంకేతిక నిపుణులతో రూపొందిన తొలి చిత్రం ‘బందూక్’ ఈ ఏడాదే వచ్చింది. ♦ సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెలుగులో తొలిచిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్‌మేన్’. మంజునాథ్ డెరైక్టర్. ‘మధుర ’ శ్రీధర్ నిర్మాత. ♦ ఒకేసారి తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన తొలి తెలుగు చిత్రం ‘రెడ్ అలర్ట్’. చంద్రమహేశ్ డెరైక్టర్. సంస్కృతంలో విఘ్నేశ్వరునిపై పాట (రచన వెనిగళ్ళ రాంబాబు, గానం శంకర్ మహదేవన్) పెట్టారు. ♦ ‘బ్రూస్లీ’ై టెమ్లో ‘రామ్‌చరణ్ యాప్’ రిలీజ్ చేశారు. తెలుగులో ఒక హీరో పేరుతో యాప్ రావడం ఇదే ఫస్ట్. -
ట్వీట్స్
‘బాహుబలి’ని హిందీలో కరణ్ జోహార్ సమర్పిస్తూ, విడుదల చేస్తున్నారు. ఆయనతో అసోసియేట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణం ఆనందంగా సాగుతుందని ఆశిస్తున్నాను. - ఎస్.ఎస్. రాజమౌళి ‘బాహుబలి’ చిత్ర దర్శకుడు -
కొడుకుతో తిరుమలకు రమ్య'కృష్ణ'
తిరుమల : ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కుటుంబ సమేతంగా తిరుమల విచ్చేశారు. గురువారం వీఐపీ బ్రేక్ దర్శనంలో కృష్ణవంశీ, రమ్యకృష్ణ దంపతులు కుమారుడు రిత్విక్తో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కృష్ణవంశీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకునేందుకు వస్తామన్నారు. 'రమ్యకు వెంకటేశ్వరస్వామి అంటే చాలా ఇష్టం. గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్ జరుగుతుంది...దసరాకి విడుదల అవుతుంది' అని కృష్ణవంశీ తెలిపారు. ప్రస్తుతం బాహుబలి షూటింగ్ జరుగుతుందని, ఆ సినిమా తర్వాత ఇంకా ఏమీ అనుకోలేదని రమ్యకృష్ణ విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ రాజమాతగా నటిస్తున్నారు. కాగా ఆలయం బయటకు వచ్చిన రమ్యకృష్ణను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. కాగా కుమారుడితో కలిసి కృష్ణవంశీ, రమ్యకృష్ణలు తొలిసారి కెమెరాకు చిక్కారు. -
20 లక్షలు!
రాజమౌళి దర్శకత్వం వహించే చిత్రాలు రికార్డులు సాధించడం చాలా సహజం. ఒకవేళ ఏదైనా సినిమా రికార్డ్ సృష్టించకపోతే అది వార్త అవుతుంది. సినిమాలపరంగా ‘సంచలనం’ అనిపించుకున్న రాజమౌళి, ఇప్పుడు ముఖపుస్తకం పరంగా కూడా ఓ రికార్డ్ సాధించారు. అదేనండి.. ‘ఫేస్బుక్’. తను చేస్తున్న చిత్రాల వివరాలతో పాటు తనకేదైనా సినిమా నచ్చితే, దాని గురించి నాలుగు మంచి మాటలతో పాటు రాజకీయాల నుంచి రచ్చబండపై జరిగే విషయాలను కూడా ఆయన ప్రస్తావిస్తుంటారు. అందుకే రాజమౌళి ఫేస్‌బుక్‌ని చాలామంది ఫాలో అవుతుంటారు. ఇప్పటికి 20 లక్షల మంది రాజమౌళి ఫేస్‌బుక్‌ని ‘లైక్’ చేశారు. దక్షిణాదిన దర్శకుల్లో ఈ రికార్డ్ సాధించింది రాజమౌళియే అని లెక్కలు చెబుతున్నాయి. రాజమౌళి అంతే.. ఏం చేసినా సంచలనమే. ఇన్నాళ్లూ వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన రాజమౌళి ఇప్పుడు ‘బాహుబలి’ షూటింగ్లో నిమగ్నమయ్యారు. ఈ షెడ్యూల్లో తమన్నా కూడా పాల్గొంటుందని ఆయన పేర్కొన్నారు -
గ్యాంగ్ లీడర్లు...
రాజకీయ నేతలుగా మారిన దాదాపు డజను మంది డాన్లు (స్థానికంగా వారిని బాహుబలి అంటారు) బీహార్ ఎన్నికల బరిలో ఉన్నారు. వారే కాదు కొందరు డాన్ల భార్యలు, గ్యాంగ్‌వార్‌లలో చనిపోయినవారి భార్యలు కూడా ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపీ పప్పూయాదవ్ ఆర్జేడీ తరఫున మాధేపుర నుంచి జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌పై పోటీ చేస్తున్నారు. సీపీఎం నేత అజిత్‌సర్కార్‌ను హత్య చేసిన కేసు నుంచి ఇటీవలే ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. పప్పూయాదవ్ భార్య, మాజీ ఎంపీ రంజిత రంజన్ కూడా కాంగ్రెస్ టికెట్‌పై సుపాల్‌నుంచి బరిలో ఉన్నారు. పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి మొహమ్మద్ తస్లీముద్దీన్ ఆర్జేడీ టికెట్‌పై అరారియా నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. క్రిమినల్ కేసులున్న వారికి టికెట్లివ్వడంలో ఆర్జేడీనే ముందుంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవించినవారి తరఫున వారి భార్యలు పోటీలో దిగారు. ఇలాంటి వారు బీహార్ లోక్‌సభ బరిలో దాదాపు ఆరుగురున్నారు. శివహర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రమాదేవి.. ప్రత్యర్ధుల దాడిలో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ బ్రిజ్‌బిహారీ ప్రసాద్ భార్య. ఓ క్రిమినల్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆనంద్‌మోహన్ భార్య లవ్లీ ఆనంద్ కూడా శివహర్ నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.