'నా భక్త కన్నప్ప.. ఓ లవ్ స్టోరీ' | 'Bhakta Kannappa' not a mythological film, says Sunil Varma | Sakshi
Sakshi News home page

'నా భక్త కన్నప్ప.. ఓ లవ్ స్టోరీ'

Published Wed, Apr 9 2014 1:04 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

'నా భక్త కన్నప్ప.. ఓ లవ్ స్టోరీ' - Sakshi

'నా భక్త కన్నప్ప.. ఓ లవ్ స్టోరీ'

అలనాటి భక్త కన్నప్ప సినిమా అంటే.. అరివీర శివభక్తుడిగా కనిపించే కృష్ణంరాజు గుర్తుకొస్తారు. కానీ ఇప్పుడు అదే పేరుతో తాను హీరోగా రూపొందుతున్న సినిమా మాత్రం భక్తి సినిమా కాదని, ఓ గిరిజన ప్రేమకథా చిత్రమని సునీల్ చెబుతున్నాడు. అందులో వినోదం కూడా కావల్సినంత ఉంటుందంటున్నాడు. తాను ఈ సినిమాలో ఓ గిరిజనుడి పాత్ర పోషిస్తున్నానని, గ్రామీణ ప్రాంతంలో అందంగా సాగిపోయే ప్రేమకథ ఇందులో ఉంటుందని చెప్పాడు. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మే రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.

మరో రెండు పెద్ద సినిమాల్లో కూడా సునీల్ చేయబోతున్నాడు. నిజానికి హీరో అయినప్పటి నుంచి తాను నటిస్తున్న సినిమాల సంఖ్య గణనీయంగా పడిపోయిందని, ఇప్పుడు కనీసం ఏడాదికి ఒక సినిమా పూర్తి చేయడం కూడా కష్టమే అవుతోందని చెప్పాడు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నానని తెలిపాడు. విక్కీ దర్శకత్వంలో ఒకటి, రచయిత గోపీమోహన్ దర్శకత్వంలో మరొక సినిమా ఈసారి చేస్తానని చెప్పాడు. 2010లో రాజమౌళి తీసిన మర్యాదరామన్నతో కమెడియన్ సునీల్ హీరోగా మారాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement