బిగ్‌బాస్‌.. డబుల్‌ ధమాకా | Bigg Boss 12 Auditions Open | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. డబుల్‌ ధమాకా

Published Mon, Apr 16 2018 11:05 AM | Last Updated on Thu, Jul 18 2019 1:53 PM

Bigg Boss 12 Auditions Open - Sakshi

ముంబై : రియాల్టీ షోల్లో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజే వేరు. అంతటి క్రేజ్‌ ఉంది కాబట్టే బిగ్‌బాస్‌ను అభిమానించే వారితో పాటు.. ఆ షోలో పాల్గొనాలకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అటువంటి వారందరికీ శుభవార్త. ఇప్పటికే 11 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న హిందీ వెర్షన్‌ బిగ్‌బాస్‌ తదుపరి సీజన్‌ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించి ఆడిషన్స్‌ కూడా మొదలు కానున్నాయి. అయితే బిగ్‌బాస్‌ సీజన్‌ 12ను ప్రత్యేకంగా రూపొందించారు నిర్వాహకులు. ఇప్పటివరకూ కేవలం సింగిల్‌ కంటెస్టెంట్లతో సాగిన ఈ షో ఈసారి డబుల్‌ ధమాకా ఇచ్చేందుకు జోడీలతో సిద్ధమవుతోంది. విషయాన్ని ప్రఖ్యాత టీవీ షో ‘రైసింగ్‌ స్టార్‌’  గ్రాండ్‌ ఫినాలే సందర్భంగా.. షో హోస్ట్‌ రవి దూబే ప్రేక్షకులకు తెలియజేశారు.   

డచ్‌ రియాల్టీ షో బిగ్‌ బ్రదర్‌ స్ఫూర్తితో బాలీవుడ్‌లో మొదలైన బిగ్‌బాస్‌ షో సీజన్‌- 1లో అర్షాద్‌ వసీ తర్వాతి రెండు సీజన్‌లకు అమితాబ్‌ బచ్చన్‌, శిల్పాశెట్టి హోస్టులుగా వ్యవహరించారు. 2011లో సల్మాన్‌ ఖాన్‌ రాకతో బిగ్‌బాస్‌ పాపులారిటీ మరింతగా పెరిగిపోయింది. ఇప్పటివరకు 8 సీజన్లకు ఆయన హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే ఈసారి హోస్ట్‌ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం రేస్‌ 3 సినిమాతో బిజీగా ఉన్న ఈ కండలవీరుడు ఈ సీజన్‌లో కూడా బిగ్‌బాస్‌తో జతకడితే అభిమానులకు పండుగే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement