నో ఎలిమినేషన్ ఓన్లీ రీఎంట్రీ! | Bigg Boss 3 Telugu : May No Elimination Only Re Entry In Ninth Week | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. నో ఎలిమినేషన్ ఓన్లీ రీఎంట్రీ!

Published Tue, Sep 17 2019 10:01 AM | Last Updated on Thu, Sep 19 2019 9:20 AM

Bigg Boss 3 Telugu : May No Elimination Only Re Entry In Ninth Week - Sakshi

ఎనిమిది వారాలను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ షో.. తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టేసింది. అయితే ఇప్పటివరకు ఏడు ఎలిమినేషన్స్‌, రెండు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు జరిగాయి. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలో ఇచ్చిన తమన్నా, శిల్పా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. హౌస్‌లోని ఇంటి సభ్యులతో వారు సరిగా కలవలేకపోయారు. బిగ్‌బాస్‌ ఆడియెన్స్‌ను మెప్పించలేక వెనుదిరిగిపోయారు. అయితే ఈ తొమ్మిదో వారంలో మరో సర్‌ప్రైజ్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా సోమవారం నాటి ఎపిసోడ్‌కే నామినేషన్‌ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. సోమవారం అర్దరాత్రి నుంచే ఓటింగ్‌ కూడా మొదలవుతుంది. కానీ నిన్నటి ఓటింగ్‌ లైన్లు తెరుచుకోలేదు ఎందుకంటే నామినేషన్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకు ఒక్క మహేష్‌ మాత్రమే నామినేషన్‌లోకి వచ్చాడు. మిగిలిన ప్రక్రియ నేటి ఎపిసోడ్‌లో పూర్తవ్వనున్నట్లు తెలుస్తోంది. అయినా రాహుల్‌ కోసం పునర్నవి జుట్టు కత్తిరించుకున్నట్లు, శివజ్యోతి కూడా ఏదో త్యాగం చేసినట్లు కనిపిస్తోంది. ఏదేమైనా.. ఈ వారం నామినేషన్‌లో ఉండేది ఒక్కరు లేదా ఇద్దరే.

అందుకే ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉండబోదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లను తిరిగి తీసుకుని రావడానికి రంగం సిద్దం చేసినట్లు సమాచారం. వీరి కోసం ఓటింగ్‌ను చేపట్టనున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే.. అలీ రెజాకు అందరి కంటే ఎక్కువ అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలీ ఎలిమినేట్‌ అయినప్పటి నుంచి అతడిని మళ్లీ రీఎంట్రీ చేయించాలని అభిమానులు సోషల్‌ మీడియాలో కోరుకుంటున్నారు. రోహిణి కూడా అనవసరంగా ఎలిమినేట్‌ అయిందనే అభిప్రాయం కొంతమందిలో ఏర్పడింది.

గత సీజన్‌లో కూడా ఇలానే జరిగింది. రీ ఎంట్రీ పెట్టినప్పుడు.. భారీ ఓట్లను సాధించి నూతన్‌ నాయుడు, శ్యామల తిరిగా హౌస్‌లోకి ప్రవేశించారు. మరి ఈ సారి కూడా అలాంటిదే రీపిట్‌ అయితే.. కచ్చితంగా అలీ రెజా ఉంటాడని అనిపిస్తోంది. మరి నిజంగానే ఈ వారం ఎలిమినేషన్‌ ఉంటుందా? లేదా? రీ ఎంట్రీపై క్లారిటీ​ కావాలంటే నేటి ఎపిసోడ్‌ ప్రసారమయ్యే వరకు ఆగాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement