బిగ్‌బాస్‌లో ఎనిమిదో వారం సందడిగానే గడిచింది. ఈ వారంలో బిగ్‌బాస్ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ ఒకెత్తు అయితే.. దానిని సరిగా అర్థం చేసుకోకుండా ఇంటి సభ్యులు ఆడిన విధానం మరో ఎత్తు. ఈ టాస్క్‌లో జరిగిన పరిణామాలు.. పునర్నవి ప్రవర్తించిన తీరు... ఆ పై టాస్క్‌ను నిందించడం.. టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్‌ను ఎదిరించడం.. లాంటివి చాలానే జరిగాయి. అయితే వీటన్నంటిపై నాగార్జున సీరియస్ అయినట్లు కనిపిస్తోంది.
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను బుల్‌షిట్ అని అంటావా? అంటూ పునర్నవిపై నాగ్ ఫైర్ అయ్యాడు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టుందని శ్రీముఖిపై సీరియస్ అయ్యాడు. అంతేకాకుండా శ్రీముఖిని ఉద్దేశిస్తూ.. నువ్వు ఈ హౌస్‌కు బాస్‌వి కాదు.. ఈ హౌస్‌కు బిగ్‌బాస్ బాస్ అంటూ ఘాటుగా స్పందించాడు. ఇక నాగ్ జోరు చూస్తుంటే.. హౌస్‌మేట్స్ అందరికీ తడిసిపోయేట్టు కనిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్ మొత్తం సీరియస్‌గా సాగుతుందా? లేదా ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉందా? అన్నది కొద్దిగంటల్లో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment