బిగ్‌బాస్‌ను ఎదురించిన పునర్నవి, మహేష్‌లపై నాగ్ ఫైర్ అవ్వడం, శ్రీముఖికి వార్నింగ్ ఇవ్వడం, టాస్క్‌లను అర్థం చేసుకుని ఆడాలని శిల్పాకు సూచనలు ఇవ్వడం..లాంటివే కాకుండా.. హౌస్‌మేట్స్‌తో ఆట ఆడించడం హైలెట్‌గా నిలిచింది. హౌస్‌మేట్స్‌లో ప్రోత్సాహాన్ని నింపేందుకు బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్ పీవీ సింధును బిగ్‌బాస్ స్టేజ్‌పైకి నాగార్జున తీసుకువచ్చాడు.
బిగ్‌బాస్‌పై తిరుగబాటు చేసిన పునర్నవి, మహేష్‌లకు నాగార్జున గట్టి వార్నింగ్ ఇచ్చాడు. బుల్‌షిట్ టాస్క్ అంటావా? అలాంటి మాటల మాట్లాడేదంటూ పునర్నవిని మందలించాడు. గేట్లు తెరిచే ఉన్నాయి వెళ్తావా? అంటూ మహేష్‌పై సీరియస్ అయ్యాడు. అయితే మహేష్ విషయంలో రాహుల్, పునర్నవిని వరుణ్ ఒప్పించిన విధానం బాగుందని వారిని మెచ్చుకున్నారు. మిగతా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నందుకు శ్రీముఖిపై ఫైర్ అయ్యాడు. రూల్స్ సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆడావని, అందుకే పునర్నవికి కోపం వచ్చిందని.. రూల్స్‌ను ఫాలో అవుతూ గేమ్ ఆడాలని శిల్పాకు సూచించాడు.
అనంతరం ఇంటి సభ్యుల్లో మహానటి/మహానటుడు/అంతకు మించి అనిపించే క్యారెక్టర్లను తెలిపాలనే టాస్క్ ఇచ్చాడు. ఇక ఈ టాస్క్‌లో రాహుల్-పునర్నవిల మధ్య గొడవ హైలెట్‌గా నిలిచింది. మొదటగా వచ్చిన రాహుల్.. పునర్నవిని అంతకు మించి క్యాటగిరీలో పేర్కొన్నాడు. అయితే అందుకు గల కారణాన్ని చెబుతూ.. టాస్క్ చెయ్యలేవ్.. కాళ్లు, చేతులు నొప్పి అని పునర్నవి అన్న విషయాన్ని ప్రస్థావించాడు. దీంతో పునర్నవి కన్నీరు పెట్టుకుంది. అనంతరం వచ్చిన పునర్నవి.. రాహుల్‌ను అంతకుమించి అని పేర్కొంది. తాను సరదాగా అన్నా కూడా సీరియస్‌గా తీసుకున్నాడని చెప్పుకొచ్చింది. ఇక నుంచి తనతో స్నేహం చేయబోనని తేల్చి చెప్పింది.
ఇక ఈ టాస్క్‌లో వితికా : శిల్పా, హిమజ.. రాహుల్: శివజ్యోతి, పునర్నివి.. రవి: శిల్పా, మహేష్.. బాబా: హిమజ, శిల్పా.. శివజ్యోతి : బాబా, రాహుల్.. పునర్నవి : హిమజ, రాహుల్.. హిమజ : శ్రీముఖి, వితికా.. శ్రీముఖి: మహేష్, హిమజ.. వరుణ్: శిల్పా, మహేష్.. మహేష్: పునర్నవి, రాహుల్.. శిల్పా : బాబా, పునర్నవిలను మహానటి/మహానటుడు, అంతకుమించి క్యాటగిరీలో పేర్కొన్నారు. చివరగా హిమజ సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఇప్పటికే అందిన సమాచారం మేరకు శిల్పా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే తరువాయి అన్నట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment