'ఇవ్వకుండానే ఇచ్చారంటే ఎలా'
బాలీవుడ్ డస్కీ బ్యూటి బిపాషా బసు మరోసారి మీడియాపై ఫైర్ అయ్యింది. బిప్స్ పెళ్లి మొదలు...ఏదో ఒక సందర్భంలో మీడియాలో వస్తున్న వార్తలు, ఈ హాట్ బ్యూటీని హర్ట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా బిపాషా, కరణ్ సింగ్ గ్రోవర్ల పెళ్లి సందర్భంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడన్న వార్త బాలీవుడ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది.
అయితే ఈ వార్తలపై స్పందించిన బ్లాక్ బ్యూటీ ఈ మధ్య కాలంలో తాను విన్న అతి పెద్ద రూమర్ ఇదేనంటూ కామెంట్ చేసింది. అంతేకాదు ఇలాంటి గిఫ్ట్ ఎవరిచ్చినా తాను తీసుకోనంటూ తేల్చి చెప్పింది. గిఫ్ట్ ఇవ్వకుండా ఇచ్చారంటూ ప్రచారం చేస్తే ఎలా అంటూ సీరియస్ అయ్యింది. మరి బిపాషా స్టేట్ మెంట్తో అయినా ఈ రూమర్స్కు తెరపడుతుందేమో చూడాలి.
This is the biggest hogwash that I have ever read. Why would I take a gift like this ever from anyone?!?? https://t.co/Et1ccoNeUE
— Bipasha Basu (@bipsluvurself) 16 June 2016