హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు దక్కే పారితోషికాలు తక్కువనే విషయం అందరికీ తెలిసిందే. బెంగాలీ బ్యూటీ బిపాసా బసు ఈ విషయాన్ని బహిరంగంగానే ఒప్పకుంది. పారితోషికాలు ఇలాగే కొనసాగుతాయని, ఈ విషయంలో మార్పు సాధ్యం కాకపోవచ్చని చెప్పింది. దీని గురించి ఆలోచించడం కూడా వృథాయేనంటూ కుండబద్దలు కొట్టింది. సల్మాన్ ఖాన్ వంటి హీరోకు కత్రినా వంటి హీరోయిన్ జోడీగా ఉంటేనే ఆ సినిమా భారీ హిట్ కొట్టే అవకాశముంటుందని, అయినా పారితోషికాల్లో మాత్రం తేడాలు ఉంటాయని చెప్పింది.
దీని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ఒరిగేదీ లేదంటూ నిట్టూర్పు విడిచింది. అయితే పాత్రల విషయంలో మాత్రం సానుకూల మార్పులు వస్తున్నాయని, కథానాయికలకు కూడా సత్తా ఉన్నవి దొరుకుతున్నాయని చెప్పింది.‘మాకు పరిశ్రమలో మంచిస్థానం దొరుకుతోంది. ఇదివరకైతే ఆడిపాడడానికే హీరోయిన్లు పరిమితమయ్యే వాళ్లు. పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయి. నటనకు అవకాశం ఉన్న పాత్రలు మహిళలకూ వస్తున్నాయి. అన్ని వయసుల మహిళా నటులకు కూడా ఆసక్తికర పాత్రలు దొరుకుతున్నాయి’ అని చెప్పిన బిప్స్ 2001 నుంచి బాలీవుడ్‌లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ తాజా సినిమా క్రియేచర్ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.
అంతేకాదు దీనిని 3డీ సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రీకరించారు. ఇటీవల విడుదలైన బాబీ జాసూస్ వంటి మహిళల ఆధారిత చిత్రాల కథలు ఎంతో బాగున్నాయని ప్రశంసించింది. అయితే బిప్స్ తాజాగా నటించిన షమ్‌షకల్స్ బాక్సాఫీసు వద్ద నిలదొక్కుకోలేకపోయింది. అంతేగాక ఇందులో ఈమె పాత్ర నిడివి చాలా తక్కువే కాదు.. బిప్స్ కంటే చాలా జూనియర్ అయిన తమన్నాకు ప్రధాన హీరోయిన్ పాత్ర ఇచ్చారు. దీంతో బిపాసా బసు సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ కనిపించలేదు.
తప్పదు.. తేడాలుంటాయ్
Published Mon, Aug 18 2014 10:21 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement