
ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ కాలేదు.
ముందుగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్‌ను తీసుకున్నారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా సైరా నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు రెహమాన్. అప్పటి నుంచి సంగీత దర్శకుడి కోసం వేట కొనసాగిస్తున్న సైరా టీం ఫైనల్ గా ఓ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామాలకు సంగీతమందించిన అమిత్, సైరా కోసం ఇప్పటికే కొన్ని ట్యూన్స్‌ను సిద్ధం చేశారట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment