బెల్లంకొండ సినిమాకు కాస్ట్లీ టెక్నీషియన్స్
అల్లుడు శీను సినిమాతో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, మంచి గుర్తింపు తెచ్చుకున్న సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. రెండో సినిమాగా చేసిన స్పీడున్నోడు కూడా నిరాశపరచటంతో మూడో సినిమాను మరోసారి భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈసినిమాలో ఎలాగైన సక్సెస్ సాధించాలన్న కసితో ఉన్న బెల్లంకొండ మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.
ఇప్పటికే భారీ తారాగణంతో అంచనాలను పెంచేస్తోన్న ఈ సినిమాకు సంబంధించి, మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తన హీరోల లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే దర్శకుడు బోయపాటి శ్రీను.. బెల్లంకొండ కోసం కాస్ట్లీ స్టైలిస్ట్లను రంగంలోకి దించాడు. బోయపాటి గత చిత్రం సరైనోడుకు పనిచేసిన హెయిర్ స్టైలిస్ట్ సోనితో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ భాస్కర్లు బెల్లంకొండ శ్రీనివాస్కు న్యూ లుక్ ఇస్తున్నారు.
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న సోని, అతిథి సినిమా నుంచి వరుసగా మహేష్ బాబు హీరోగా నటించిన 7 సినిమాలకు పని చేసింది. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ కోసం పనిచేసిన సోని ఇప్పుడు డీజే కూడా పనిచేస్తోంది. మిర్చి, సింహా, లెజెండ్ లాంటి సినిమాలకు పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్ భాస్కర్ కూడా బెల్లంకొండ శ్రీనివాస్, బోయపాటి శ్రీనుల సినిమాకు పనిచేస్తున్నాడు.