
చక్రిది సహజ మరణమే!!
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతిపై నెలకొన్న అనుమానాలన్నీ వీడిపోయాయి. ఆయన అస్థికల్లో ఎలాంటి విషపదార్థాలు లేవని ఫోరెన్సిక్ పరీక్షలలో వెల్లడైంది. చక్రి అస్థికలను ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించి చూశారు. అయితే అందులో ఎలాంటి విష పదార్థాల ఆనవాళ్లు లేవని వాళ్లు తేల్చారు. దాంతో చక్రిది సహజమరణమే తప్ప అందులో అనుమానించాల్సిన విషయం ఏమీ లేదని తేల్చి చెప్పారు.
టాలీవుడ్ సంగత దర్శకుడు చక్రి మరణంపై మిస్టరీ ఉందంటూ కుటుంబ సభ్యులు ఇంతకుముందు అనుమానాలు వ్యక్తం చేశారు. చక్రి భార్య శ్రావణి, ఆమె అత్తమామలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఉత్త అనుమానాలు మాత్రమేనని తేలిపోయింది.