అందుకే అజ్ఞాతవాసం! | charmi beauty secrets | Sakshi
Sakshi News home page

అందుకే అజ్ఞాతవాసం!

Apr 21 2016 10:43 PM | Updated on Sep 3 2017 10:26 PM

అందుకే అజ్ఞాతవాసం!

అందుకే అజ్ఞాతవాసం!

ఇంకొన్నాళ్ల పాటు అత్యంత ఆప్తులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు తప్ప చార్మి దర్శనాలు ఉండవు.

ఇంకొన్నాళ్ల పాటు అత్యంత ఆప్తులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు తప్ప చార్మి దర్శనాలు ఉండవు. అజ్ఞాతంలోకి వెళ్లిపోతారట. చార్మి అంత తప్పేం చేసిందనుకోకండి. ఓ పాత్ర కోసం వర్కవుట్ చేస్తున్నారు. అందుకే ఎవరికీ కనిపించకూడదనుకుంటున్నారు. ఇంతకీ చార్మి బరువు తగ్గనున్నారా? పెరగనున్నారా? అది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ లుక్ హిందీ సినిమా కోసమా? తెలుగుకా? అని కూడా చెప్పరట.
 
మరీ ఊరిస్తున్నారు కదూ. అందగత్తెలు ఏం చెప్పినా.. చెప్పకపోయినా బాగానే ఉంటుంది. ఆ సంగతలా ఉంచితే... ‘జ్యోతిలక్ష్మి’తో ఈ బ్యూటీ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. మరి.. మళ్లీ సినిమా నిర్మించే ఉద్దేశం లేదా? అనే ప్రశ్న చార్మి ముందుంచితే... ‘‘ఆ సినిమా తర్వాత నిర్మాణం మీద ఆసక్తి పెరిగింది. ఓ సినిమా నిర్మించ డానికి రెడీ అవుతున్నా. అలాగే, వేరే చిత్రంలో కూడా నటించనున్నా. అందుకే నా లుక్ ను మార్చుకుంటున్నా.
 
సన్నగా కనిపిస్తానా? లావుగానా? అనే విషయం చెప్పను. కాస్త లేటైనా.. లేటెస్ట్‌గా ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించకూడదనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. ఈ గ్యాప్‌లో ఎలాంటి వర్కవుట్లు, డెట్ తీసుకుంటారనే విషయానికి వస్తే.. ‘‘రోజూ ఉదయాన్నే ఐదు గంటలకు నా డైలీ రొటీన్ స్టార్ట్ అవుతంది. కొంతసేపు వర్కవుట్స్ చేస్తాను.
 
ఆ తర్వాత పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటా. రెండు గంటలకు ఒకసారి 80 గ్రాములకు మించకుండా ఎగ్, చికెన్, ఫిష్ తింటాను. లంచ్‌కి రోటీ, రెండు స్పూన్ల పప్పు, కూరగాయలు తింటా. రాత్రి మాత్రం ఓ యాపిల్‌తో సరిపెట్టేస్తా. తొమ్మిదన్నరకల్లా నిద్రకు ఉపక్రమిస్తా’’ అని చార్మి అన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement