మైటీ రాజు వస్తున్నాడు | Chhota Bheem and Mighty Raju Animation Hindi film | Sakshi
Sakshi News home page

మైటీ రాజు వస్తున్నాడు

Published Thu, Apr 24 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM

మైటీ రాజు వస్తున్నాడు

మైటీ రాజు వస్తున్నాడు

పిల్లలకు ఇష్టమైన యానిమేషన్ చిత్రం ‘చోటా భీమ్’. ఇందులో మైటీ రాజు పాత్రంటే కూడా పిల్లలకు మహా ఇష్టం. ఆ పాత్రనే హీరోగా చేసుకొని రూపొందిన మరో యానిమేషన్ హిందీ సినిమా ‘మైటీ రాజు రియో కాలింగ్’. రాజీవ్ చిలక, అనిర్బన్ మజుందార్ దర్శకులు. రాజీవ్ చిలక, సామిర్ జైన్ నిర్మాతలు. శ్యామల్ చౌలియా ఈ సినిమాకు యానిమేషన్ అందించారు. ఈ సినిమా యూనిట్ గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్, యాక్షన్ నేపథ్యంలో సాగే సూపర్‌హీరో సినిమా ఇదని, బ్రెజిల్‌లోని పలు ప్రదేశాలను తెరకెక్కించామని, సునిల్ సంగీతానికి, సునిధి చౌహాన్ గానానికి మంచి స్పందన రావడం ఖాయమని నిర్మాతలు చెప్పారు. ఇంకా చెబుతూ -‘‘వచ్చే నెలలో 300 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తాం. ఆ తర్వాత స్థానిక భాషల్లో అనువదించే విషయాన్ని ఆలోచిస్తాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement