
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ప్రముఖ యానిమేషన్ కంపెనీ గ్రీన్ గోల్డ్ యానిమేషన్ కోవిడ్-19 వైరస్‌పై తనదైన శైలిలో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపట్టింది. కోవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ వైరస్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారంతో చోటా భీమ్ కేరెక్టర్ ద్వారా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ట్విటర్‌లో షేర్ చేశారు.
ముఖ్యంగా చిన్న పిల్లలు అత్యంత ఇష్టపడే చోటా భీమ్ కేరెక్టర్ ద్వారా కోవిడ్ లాంటి కీలకమైన, అత్యంత ఆవశ్యకమైన అంశంపై ప్రజలను చైతన్యపరిచేందుకు ముందుకు వచ్చిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థను ఆయన అభినందించారు. చోటా భీమ్ కేరెక్టర్ ద్వారా చేపట్టిన ప్రచారం ముఖ్యంగా బడిపిల్లల్లో విసృత అవగాహన పెంపొందిస్తుందని గ్రీన్ గోల్డ్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment