ఒకే వీడియోలో ఛోటా భీమ్, రాహుల్ గాంధీ!
రాహుల్‌గాంధీ.. ఒకరకంగా నెటిజన్లకు చాలా ఇష్టమైన పేరు. కొందరు ఆయన నాయకత్వాన్ని అభిమానిస్తే.. మరికొందరు ఆయన ప్రసంగాలు, విమర్శలపై జోకులు పేలుస్తుంటారు. రాజకీయాల్లో రాహుల్ రాణించడం సంగతి పక్కనపెడితే.. ఆయన మాత్రం దేశ ప్రజల్ని ఎంటర్‌టైన్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారని ఇంకొందరు ఛలోక్తులు విసురుతుంటారు. మొత్తానికి నెటిజన్లలో రాహుల్‌కు మాత్రం మంచి క్రేజ్ ఉంది.
దీనిని ఉపయోగించుకొని 'దేశీ స్టఫ్' అనే గ్రూప్ ఓ కొత్త వీడియోను తీసుకొచ్చింది. ఈ వీడియోలో చిన్నారుల సూపర్ హీరో 'ఛోటా భీమ్'ను, రాహుల్‌ను ఓకే వేదికపైకి తీసుకొచ్చింది. కొన్ని రోజుల కిందట రాహుల్ గాంధీ చేసిన ఆవేశపూరిత ప్రసంగానికి.. 'ఛోటా భీమ్' ఎక్స్‌ప్రెషన్స్ జోడించింది. సహజంగానే జోడింపు నవ్వుల పువ్వులు కురిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. రాహుల్ ఇలాగే దేశాన్ని నవ్విస్తూ ముందుకు నడుపాలని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.