
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
‘చిత్ర పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రులు స్పందించి ఓ కమిటీను నియమించాలి’ అని అన్నారు నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ప్రస్తుతం సినిమా పరిశ్రమలోని సమస్యలన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ ద్వారా ఆయన కోరినట్టు పేర్కొన్నారు. ‘‘డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు నిర్మాతలకు జరుగుతున్న వివాదం వల్ల సినిమాను అభిమానించే వారికి ఇబ్బందిగా మారింది. సినిమా తప్పితే వారికి వేరే వినోదం లేదు. 4 ఆటలతో పాటుగా 5వ ప్రదర్శనగా చిన్న సినిమాలు ఆడించి, ట్యాక్స్ లేకుండా ఓ జీవో తీసుకువచ్చి చిన్న సినిమాలను, నిర్మాతలను బతికించాలి.
మేం ఇచ్చిన కంటెంట్‌తోనే కోట్లు ఆర్జిస్తున్న డిజిటల్ సర్వీస్ వాళ్లు మా సినిమాలను ఫ్రీగా ప్రదర్శించాలి. యూఎఫ్‌ఓ, క్యూబ్ రెండు మోనోపోలి ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వమే థియేటర్స్‌లో ప్రొజెక్టర్స్ బదులు ప్రొజెక్టర్స్ సరఫరా ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పరేషన్ ఏర్పాటు చేయాలి. టికెట్ బుక్కింగ్స్‌కు అదనంగా చార్జీలు పడుతున్నాయి, దాని కోసం ప్రభుత్వమే ఒక కొత్త పోర్టల్ ఏర్పాటు చేసి అందులో కొంత భాగం నిర్మాతకు ఇవ్వాలి. ఈ సమస్యలన్ని ఆలోచించి ప్రేక్షకులని, నిర్మాతలను కాపాడటం కోసం ఏదో పరిష్కారం ఆలోచించాలి’’ అని లేఖలో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు.