
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ‘సైరా’ మూవీ కోసం గతేడాదిగా మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. చిరు గత పుట్టిన రోజున విడుదల చేసిన టీజర్‌తో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమాతో మళ్లీ రికార్డులు బ్రేక్ చేస్తారని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని కెమెరామెన్ రత్నవేలు ప్రకటించారు.
ఓ వైపు షూటింగ్ జరుగుతూ ఉండగానే డబ్బింగ్ పనులు మొదలుపెట్టారని అప్పట్లో వార్తలు వినిపించాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు చిరు రికార్డు టైమ్‌లో తన డబ్బింగ్‌ను పూర్తి చేశారని టాక్. అసలే చారిత్రాత్మక చిత్రం కావడంతో.. భారీ డైలాగ్‌లు కూడా ఉంటాయని తెలిసిందే. అయినా చిరు తన డబ్బింగ్‌ను ఫుల్ స్పీడ్‌గా కంప్లీట్ చేశారని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేసేందుకు ప్లాన్‌చేస్తున్నారు.