సినిమా చూపిస్తాడు! | 'Cinema Choopistha Maava' on August 14th | Sakshi
Sakshi News home page

సినిమా చూపిస్తాడు!

Published Wed, Aug 5 2015 10:52 PM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

సినిమా చూపిస్తాడు!

సినిమా చూపిస్తాడు!

అటు ప్రేమను, ఇటు మామను సాధించుకున్న ఓ అల్లరి కుర్రాడి కథే ‘సినిమా చూపిస్త మావ’. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా, రావు రమేశ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేశ్ డి. సాహిల్, జి.సునీత నిర్మించిన  ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. బెక్కెం గోపి మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా చూసి ‘దిల్’ రాజుగారు నైజాంలో విడుదల చేస్తున్నారు. దాంతో మా సినిమాపై ఇంకా నమ్మకం పెరిగింది’’ అన్నారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో నాకు, అవికా గోర్‌కు మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఓ మంచి ప్రేమకథకు మాస్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement