షారుక్ ఖాన్పై పిటీషన్ ఉపసంహరణ
ముంబై హైకోర్టులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కు ఉపశమనం కలిగింది. షారుక్ దంపతులు తమ మూడో బిడ్డకు గర్భంలో ఉన్నప్పుడు లింగనిర్ధారణ పరీక్షలు చేయించారని వారిపై దాఖలు చేసిన పిటీషన్ను గురువారం ఉపసంహరించుకున్నారు.
సరోగసీ పద్ధతి ద్వారా షారుక్ దంపతులు జన్మనిచ్చిన మూడో బిడ్డకు ముందస్తు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ వర్షా దేశ్పాండే అనే సామజిక ఉద్యమకర్త పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కోర్టు విచారణకు స్వీకరించడంతో పాటు వాదనలు కూడా నడిచాయి. షారుక్ దంపతులు చట్టవిరుద్ధంగా వ్యవహరించలేదంటూ వైద్యులు నివేదిక అందజేశారు. దిగువ కోర్టులో వర్షా దాఖలు చేసిన పిటీషన్ను కొట్టేయగా, హైకోర్టులోనూ ఉపసంహరించుకుంటున్నట్టు ఆమె తెలిపారు.