‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ | Confirm Samuthirakani In SS Rajamouli RRR Movie | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 24 2019 1:20 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

Confirm Samuthirakani In SS Rajamouli RRR Movie - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిం‍దే. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం మెగా, నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి టీం మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ ఇవ్వుకుండా ఊరిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో కోలీవుడ్‌ విలక్షణ నటడు సముద్రఖని కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని సముద్రఖని స్వయంగా వెల్లడించారు. ‘నడోడిగల్‌ సినిమా సమయంలో రాజమౌళి ఓ సుధీర్ఘ మేసేజ్‌ చేసి నన్ను అభినందించారు.

ఇటీవల ఆయన నన్ను స్వయంగా ఇంటికి ఆహ్వానించి ఆర్‌ఆర్‌ఆర్‌లో పాత్ర గురించి చెప్పారు. నేను వెంటనే అంగీకరించాన’ని తెలిపారు. ప్రస్తుతం సెకండ్‌ షెడ్యూల్‌ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

                         తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement