
మరో హీరో తమ్ముడు వస్తున్నాడు..
హీరోల తమ్ముళ్లు వారసులుగా తెరంగేట్రం చేయడం సాధారణ విషయమే. బాలీవుడ్లో మరో హీరో తమ్ముడు ఎంట్రీ ఇస్తున్నాడు. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ ఓ బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడు.
ఇషాన్ తెరంగేట్రం చేయనున్నట్టు ఇటీవల వచ్చిన వార్తలను షాహిద్ తల్లి నీలిమా అజీమ్ ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువీకరించింది. తన రెండో కొడుకు కూడా హీరో అవుతున్నాడని, షాహిద్ మాదిరిగా ఇషాన్ కూడా మంచి డాన్సర్ అని చెప్పింది. ఇషాన్, శ్రీదేవి ముద్దుల తనయ జాహ్నవి, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్లతో కరణ్ జోహార్ ఓ సినిమా తీయనున్నట్టు ఇటీవల కథనాలు వినిపించినా, ఇషాన్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్కు పరిచయం అవుతాడా లేదా అన్న విషయం నిర్ధారణ కాలేదు.