అజిత్, శింబు అభిమానుల మధ్య గొడవ | Confrontation between Ajith, Shimbu fans | Sakshi
Sakshi News home page

అజిత్, శింబు అభిమానుల మధ్య గొడవ

Published Tue, May 31 2016 2:22 AM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

అజిత్, శింబు అభిమానుల మధ్య గొడవ - Sakshi

అజిత్, శింబు అభిమానుల మధ్య గొడవ

తమిళసినిమా: సినీ నటుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు. అలాంటివేమైనా ఉన్నా బయట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎక్కడై నా తారసపడ్డా చిరునవ్వులతో ఆలింగనం చేసుకుంటారు. తమ మధ్య మంచి స్నేహ బంధం ఉందంటారు. అయితే వారి అభిమానులు మాత్రం తరచూ గొడవలకు దిగుతుంటారు. ఒకరినొకరు దూషించుకుంటూ తలలు బద్దలు కొట్టుకుంటారు. ఆదివారం తిరుచ్చిజిల్లాలో సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది.

వివరాలు...తిరుచ్చి జిల్లా, తిరువెరుంబూర్ భగవతీపురంలోని అమ్మన్ ఆలయంలో వారం రోజు లుగా ఉత్సవాలు జరుగుతున్నాయి. చివరి రో జు ఆదివారం రాత్రి పసుపు జలాలతో అభిషే కం నిర్వహించారు. ఆ సమయంలో అదే ప్రాం తానికి చెందిన నటుడు అజిత్, విజయ్ అభిమానులకు, నటుడు శింబు అభిమానులకు మధ్య పరస్పర వాగ్వాదం గొడవకు దారి తీసింది.

దీంతో ఆ ప్రాంతానికి చెందిన శంకర్ అనే వ్యక్తి ముందుకు వచ్చి ఇరు వర్గాలకు నచ్చజెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే జాఫర్ అనే వ్యక్తి అనూహ్యంగా శంకర్ మీద దాడి చేసి ఇనుప రాడ్డుతో కొట్టడంతో మళ్లీ గొడవ జరి గింది. గొడవల్లో ఆ ప్రాంతానికి చెందిన కరుప్పయ్య, చంద్రశేఖర్, పెరియసామి తదితర 8 మంది గాయాల పాలయ్యారు. వారిని స్థానికు లు తువాంగుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ ప్రాంతానికి చెందిన 100 మందికిపైగా తిరువెరుంబూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయడానికి వెళ్లారు. అయితే పోలీసులు వారి ఫిర్యాదును నిరాకరించడంతో మహిళలు పోలీస్‌స్టేషన్‌ను చుట్టి ముట్టి ఆందోళనకు దిగా రు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరిపి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement