
మాస్క్‌తో ప్రభాస్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు పాకింది. తెలంగాణలో ఓ కేసు నమోదు కాగానే సామాన్య ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దీనికితోడు కరోనా అనుమానితులు ఎక్కువవుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. కోవిడ్ కష్టాలు సామాన్య ప్రజలనే కాదు సినీ స్టార్లను కూడా వెంటాడుతున్నాయి. నిత్యం బిజీ షెడ్యూల్లతో ఊర్లు చుట్టే సినీతారలు వైరస్ తమను ఏవైపునుంచి అటాక్‌చేస్తుందోనని భయపడుతున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ హీరో ప్రభాస్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఓ ఎయిర్‌పోర్టులో తీసిన ఆ వీడియోలో ప్రభాస్ మాస్క్ ధరించి ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ఫేమ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ (వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్ సినిమాలో నటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment